బాలీవుడ్-డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. హీరోయిన్లకు సమన్లు

బాలీవుడ్-డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. హీరోయిన్లకు సమన్లు
x
Highlights

బాలీవుడ్-డ్రగ్ కేసులో కీలక పరిణామం.. హీరోయిన్లకు సమన్లు.. బాలీవుడ్-డ్రగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అగ్ర నటీమణులు..

బాలీవుడ్-డ్రగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అగ్ర నటీమణులు దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్, శ్రద్ధా కపూర్ లకు సమన్లు ​​జారీ చేసింది. ఇప్పటికే దీపికా మేనేజర్ కరిష్మా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ శ్రుతి మోడీలను ప్రశ్నించారు. రాబోయే మూడు రోజుల్లో నటీమణులను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

జయ సాహతో పాటు కరిష్మాను ఎన్‌సిబి అంతకుముందు విచారించింది. ఎన్‌సిబి వర్గాల సమాచారం ప్రకారం, జయ సాహా , కరిష్మా మధ్య చాట్స్‌ని కనుగొన్నారు, ఇందులో వారు డ్రగ్స్‌ గురించి చర్చిస్తున్నట్టు ఉంది. కరిష్మాతో దీపిక వాట్సాప్ చాట్లను కూడా ఎన్‌సిబి సేకరించినట్టు తెలుస్తోంది, ఇందులో ఇద్దరూ డ్రగ్స్ గురించి చర్చించారు. అంతకుముందు, సిబిడి ఆయిల్ గురించి రియా చక్రవర్తితో జయ చేసిన చాట్లపై కూడా ఎన్‌సిబి ఆరాతీస్తోంది. కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై దర్యాప్తు చేస్తుండగా అనూహ్యంగా డ్రగ్స్ వివరాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories