గోవాలో కూలిన నేవీ జెట్ మిగ్ -29 కె విమానం

గోవాలో కూలిన నేవీ జెట్ మిగ్ -29 కె విమానం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ఆదివారం గోవాలో భారత నేవీ మిగ్ విమానం కూలిపోయింది. ఈ విషయాన్నీ భారత నావికాదళం ధృవీకరించింది. రొటీన్ ప్రక్రియలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆదివారం గోవాలో భారత నేవీ మిగ్ విమానం కూలిపోయింది. ఈ విషయాన్నీ భారత నావికాదళం ధృవీకరించింది. రొటీన్ ప్రక్రియలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మిగ్ 29 కె విమానం ఆదివారం ఉదయం 10.30 గంటలకు గోవా తీరంలో ఒక సాధారణ శిక్షణా ప్రక్రియను నిర్వహిస్తోంది. ఆ సమయంలో అదుపుతప్పి విమానం కూలిపోయింది.

విమానం పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది భారత నావికాదళం, అందులో " ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించబడింది.. లోపాలను పరిశీలించాలి " అని పేర్కొంది. గత రెండేళ్ల వ్యవధిలోనే గోవాలో మూడుసార్లు విమాన ప్రమాద ఘటనలు జరిగాయి. నవంబర్ 2019 లో గోవాలోని ఒక గ్రామం బయట మిగ్ 29 కె విమానం కూలిపోయింది. ఈ ఘటన జరిగిన మూడు నెలల తరువాత తాజా ప్రమాదం జరిగింది.

నవంబర్ 16 న గోవాలోని ఒక గ్రామం బయట భారత నేవీ ఎంఐజి ట్రైనర్ విమానం కూలిపోయింది. ఈ ఘటన రాష్ట్ర రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెర్నా శివార్లలోని రాతి పీఠభూమిపై ఈ విమానం కూలిపోయింది.. అయితే పైలట్ ఈ విమానాన్నీ జనాభా లేని ప్రాంతానికి తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పుడు కూడా , పైలట్లు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.

అప్పట్లో విమానం ఇంజిన్ లోకి పక్షి వెళ్లడంతో మంటలు చెలరేగాయి.. దాంతో ఎడమ ఇంజిన్ క్రాష్ అయింది. అలాగే జనవరి 2018 లో గోవాలో మరో మిగ్ -29 కె విమానం కూలిపోయింది. ఈ విమానం రన్‌వేపై నుంచి దూసుకెళ్లి ఐఎన్ఎస్ హమ్సా బేస్ లోపల కుప్పకూలింది. ఘటనలో ట్రైనీ పైలట్ విమానం నుండి సురక్షితంగా బయట పడ్డారు. ఈ సంఘటన కారణంగా గోవా విమానాశ్రయానికి పౌర విమానాల రాక పోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories