విక్రమ్‌ ల్యాండర్‌ అచూకీ..? నాసా ఫోటోల్లో ఏముంది ?

విక్రమ్‌ ల్యాండర్‌ అచూకీ..? నాసా ఫోటోల్లో ఏముంది ?
x
Highlights

-చంద్రుడిపై కూలిన విక్రమ్‌ ల్యాండర్‌ - విక్రమ్‌ ల్యాండ్‌ అయిన ప్లేస్‌ ఫోటోలు తీసిన నాసా - హై-రిజల్యూషన్‌ ఫోటోలను విడుదల చేసిన నాసా - చంద్రుడిపై విక్రమ్‌ హార్డ్‌ ల్యాండింగ్‌ చేసిందని ట్వీట్‌

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థం నాసా(NASA) చంద్రయాన్‌-2కు సంబంధించిన పలు కీలక చిత్రాలను విడుదల చేసింది. నాసాకు చెందిన లూనార్‌ రికనైజాన్స్‌ ఆర్బిటర్‌ కెమెరా చంద్రుడి సమీపంలో తిరుగుతున్న సమయంలో చిత్రాలను తీసింది. చంద్రయాన్‌-2 నుంచి విడిపొయిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై హార్డ్‌ ల్యాండింగ్‌ చేసిందని పేర్కొంటూ, అది హార్డ్‌ ల్యాండ్‌ అయిన ప్రదేశానికి సంబంధించిన హైరిజల్యూషన్‌ ఫొటోలను నాసా విడుదల చేసింది. చంద్రుడి ఉపరితలంపైనున్న ఎత్తైన మైదానప్రాంతంలో విక్రమ్‌ ల్యాండర్‌ను సున్నితంగా ల్యాండ్‌ చేసేందుకు ఇస్రో ప్రయత్నించింది.

అయితే, సెప్టెంబర్‌ 7న చంద్రుడికి చేరువుగా వెళ్లినప్పటికీ చివరి నిమిషంలో ల్యాండర్‌తో ఇస్రో గ్రౌండ్‌ సెంటర్‌కు మధ్య సంబంధాలు తెగిపోయాయి. అయితే తిరిగి ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు ఇస్రో శాయశక్తులా కృషి చేసినా అది వీలుపడలేదు. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై హార్డ్‌ ల్యాండింగ్‌ అయిన విషయాన్నిఇస్రో కూడా ఇప్పటికే నిర్ధారించింది. విక్రమ్‌ ల్యాండ్‌ కావాల్సిన నిర్ధారిత ప్రదేశాన్ని LROC తన కెమెరాలో బంధించింది. చంద్రుడిపై 150 కిలోమీటర్ల దూరంలో చిత్రించింది. అయితే, విక్రమ్‌ కచ్చితంగా ఎక్కడ హార్డ్‌ ల్యాండ్‌ చేసిందా లేదా ఇంకా గుర్తించాల్సి ఉందని నాసా తెలియజేసింది.

విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో సంబంధాలు తెగిపోయాయి. దీంతో తిరిగి కమ్యూనికేషన్‌ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు. ఆ ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయంతో ముగిసిపోయింది. చంద్రుడిపై పగటివేళ 130 డిగ్రీల సెల్రియస్‌ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి వేళ దాదాపు మైనస్‌ 200 డిగ్రీలకు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. విక్రమ్‌ ల్యాండర్‌ తో అందులోని రోవర్‌ ఇంతటి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories