దేశంలోనే ఫస్ట్.. డ్రైవర్‌లెస్ ట్రైన్ రేపు ప్రారంభించనున్నప్రధాని మోదీ

దేశంలోనే ఫస్ట్.. డ్రైవర్‌లెస్ ట్రైన్ రేపు ప్రారంభించనున్నప్రధాని మోదీ
x
Highlights

దేశంలో రైళ్లు నడవాలంటే లోకో ‌కచ్చితంగా పైలట్ఉండాల్సిందే. అయితే కొన్ని దేశాల్లో డ్రైవర్‌లెస్ ట్రైన్లు నడుస్తున్నాయి.

దేశంలో రైళ్లు నడవాలంటే లోకో ‌కచ్చితంగా పైలట్ఉండాల్సిందే. అయితే కొన్ని దేశాల్లో డ్రైవర్‌లెస్ ట్రైన్లు నడుస్తున్నాయి. కానీ మన దేశంలో ఇప్పటి వరకూ ఫుల్లీ ఆటోమెటెడ్ డ్రైవర్‌లెస్ ట్రైన్ లేదు. కానీ రేపటి ( సోమవారం ) నుంచి ఫుల్లీ ఆటోమెటెడ్ ట్రైన్ అందుబాటులోకి రాబోతోంది. ఢిల్లీ మెట్రోలోని మ్యాగెంటా లైన్‌లో ఆటోమేటెడ్ రైలు పట్టాలపై రేపటి నుంచి పరుగులు పెట్టనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ హైటెక్ ట్రైన్‌ను ప్రారంభించనున్నారు.

ఢిల్లీ మెట్రో రైల్ నెట్‌వర్క్‌లో లైన్-7, లైన్-8కే డ్రైవర్‌లెస్ రైళ్లు పరిమితం కానున్నాయి. UTO, CBTC సదుపాయాలు ఈ లైన్లలోనే ఉన్నాయి. ఫేజ్ 3 మెట్రోలో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. ఇక మొట్ట మొదటి డ్రైవర్‌లెస్ రైలు లైన్ 7లో పరుగులు పెట్టనుంది. 2017 డిసెంబరులో ఢిల్లీ మెట్రోలోని పింక్ లైన్‌‌లో 20 కి.మీ. స్ట్రెచ్‌లో ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో అన్‌అటెంటెడ్ ట్రైన్ ఆపరేషన్స్ (UTO), కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ (CBTC) సిగ్నలింగ్ సిస్టమ్ ఉంది.

కమాండ్ సెంటర్లలో ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌‌తో పాటు క్రౌడ్ మానిటరింగ్‌ను ఇన్ఫర్మేషన్ కంట్రోలర్స్ హ్యాండిల్ చేస్తాయి. సీసీ టీవీ సాయంతో ట్రైన్ ఎక్విప్‌మెంట్ మొత్తాన్ని రియల్ టైమ్‌లో రోలింగ్ కంట్రోలర్స్ మానిటర్ చేస్తాయి. డ్రైవర్‌లెస్ ట్రైన్ సిస్టమ్‌ను పరిశీలించడంతో పాటు నిరంతర సమీక్ష కోసం ఓ కన్సల్టెంట్‌తో పాటు సిస్ట్రా ఎంవీఏ, సిస్ట్రా ఫ్రాన్స్ నేతృత్వంలోని కన్సార్షియంని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నియమించింది.

డ్రైవర్‌లెస్ రైలును ఢిల్లీ మెట్రో పరిధిలోని మూడు కమాండ్ సెంటర్ల ద్వారా నియంత్రిస్తారు. ఇందులో ఎలాంటి మానవ ప్రమేయం ఉండదు. రైళ్లో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వచ్చినా CBTC టెక్నాలజీ సాయంతో వెంటనే పరిష్కరించవచ్చు. హార్డ్‌వేర్ రీప్లేస్‌మెంట్ సమయంలో మాత్రమే మనుషుల అవసరం ఉంటుంది. మిగతా అంతా ఆటోమేటిగ్గానే జరిగిపోతుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories