
భారత్-అమెరికాల మధ్య మైత్రి చిరకాలం కొనసాగుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
భారత్-అమెరికాల మధ్య మైత్రి చిరకాలం కొనసాగుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా గుజరాత్‌లోని మోతెరా స్టేడియం వేదికగా ప్రసంగించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. '' ట్రంప్ అభిప్రాయాలకు ధన్యవాదాలు తెలిపారు. మహాత్మాగాంధీ, పటేల్, స్వామి వివేకానంద గురించి ట్రంప్ ప్రస్తావించడం గర్వకారణమని అన్నారు. ఈ మైదానం గురించి ట్రంప్ అన్న ప్రతిమాట క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు. అమెరికాలో 40లక్షల మంది భారతీయులు ఉన్నారని వారంతా అమెరికా సౌభాగ్యం కోసం కృషి చేస్తున్నారని మోదీ తెలిపారు. వైట్ హౌస్‌లో దీపావళి నిర్వహించడం భారతీయులకు గర్వకారణమని చెప్పారు. భారత్‌లో జీవన ప్రమాణాల మెరుగుదలతో వేగంగా సాగుతుంది మోదీ పేర్కొన్నారు. మోతెరాలో ప్రసంగం అనంతరం ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి ఆగ్రాకు బయలుదేరారు. సాయంత్రం ఆగ్రాలోని అక్కడ ప్రపంచ అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను వీక్షిస్తారు.
प्रथम महिला और मैं इस देश के हर नागरिक को एक सन्देश देने के लिए दुनिया का 8000 मील का चक्कर लगा कर यहां आये हैं l अमेरिका भारत को प्रेम करता है - अमेरिका भारत का सम्मान करता है - और
— Donald J. Trump (@realDonaldTrump) February 24, 2020
अमरीका के लोग हमेशा भारत के लोगों के सच्चे और निष्ठावान दोस्त रहेंगे l https://t.co/1yOmQOEnXE

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




