చిన్నచిన్న జాగ్రత్తల వల్ల కరోనాని అరికట్టవచ్చు : మోదీ వీడియో సందేశం

చిన్నచిన్న జాగ్రత్తల వల్ల కరోనాని అరికట్టవచ్చు : మోదీ వీడియో సందేశం
x
Modi (File Photo)
Highlights

కరోనా వైరస్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. దీనిపైన వస్తున్న వదంతులను నమ్మకండి.. ఈ వైరస్ బారిన పడకుండా మనం

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన ఈ వ్యాధి ఇప్పుడు దాదాపుగా 140 పైగా దేశాలకి సోకి 6500 మంది పైగా ప్రాణాలను బలితీసుకుంది. ఇక భారత్ లో కూడా వందకి పైగానే కేసులు నమోదు అయ్యాయి. మరికొంత మందికి చికిత్స జరుగుతుంది. ఇక ఈ వ్యాధిని అరికట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చాయి. అంతేకాకుండా సినిమా ధియేటర్స్, షాపింగ్ మాల్స్ లను ఈ నెల చివరివరకు మూసివేశాయి. అయితే దీనిపైన ప్రజల్లో అవగాహన కలిపించేందుకు భారత ప్రధాని మోడీ వీడియో ద్వారా సందేశాన్ని పంపారు.

కరోనా వైరస్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. దీనిపైన వస్తున్న వదంతులను నమ్మకండి.. ఈ వైరస్ బారిన పడకుండా మనం చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా తరచూగా చేతులను కడుకుంటూ ఉండాలి. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించండి. ఇక వైరస్‌ వచ్చినట్లు మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా సరే భయపడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స పొందండి. వ్యక్తిగత శుభ్రత అనేది చాలా ప్రతి ఒక్కరికి చాలా అవసరం" అంటూ వీడియో ద్వారా సందేశమిచ్చారు మోడీ..

ఇక సుమారు 140 దేశాలకు పైగా ఈ కరోనా వైరస్‌ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం లక్షా 30వేల 237 కేసులు నమోదయ్యాయి. అందులో 68వేల 677 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకా 56వేల 804 మంది చికిత్స పొందుతున్నారు. 5వేల 714 మందికి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా వెయ్యి 600 కేసులు నమోదయినట్లు సమాచారం. కరోనాతో మొత్తం ఇప్పటి వరకు 6,526 మంది మృతి చెందినట్లు సమాచారం.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories