Bharat Mobility Global Expo 2024: 2047 నాటికి ‘‘ వికసిత్ భారత్ ’’ దిశగా నేటి భారతం

Narendra Modi Participated Bharat Mobility Global Expo 2024
x

Bharat Mobility Global Expo 2024 : 2047 నాటికి ‘‘ వికసిత్ భారత్ ’’ దిశగా నేటి భారతం

Highlights

Bharat Mobility Global Expo 2024: నాస్కామ్‌తో పాటు ఇతర ప్రముఖ కంపెనీల మద్దతుతో ఎక్స్ పో

Bharat Mobility Global Expo 2024: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌‌పోను ప్రధాని మోడీ సందర్శించారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఎక్స్‌ పో ను ఏర్పాటు చేశారు. భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ నిపుణ్యాన్ని ప్రదర్శించేందకు ఈ ఎక్స్ పోను నిర్వహించారు.

ప్రస్తుతం ప్రపంచంలోని మూడవ-అతిపెద్ద ప్రయాణీకుల వాహన మార్కెట్, రెండవ-అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్, ప్రపంచ ఆటోమొబైల్ తయారీ హబ్‌గా భారత్ నిలిచింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్, ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి నాస్కామ్ వంటి ప్రభుత్వ సంస్థలు, పారిశ్రామిక సంస్థల మద్దతుతో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇక, ఈ ఈవెంట్‌లో 28 ప్రముఖ వాహన తయారీదారులు పాల్గొంటాయి. మారుతి సుజుకి , మహీంద్రా, స్కోడా, మెర్సిడెస్-బెంజ్, BMW, హ్యుందాయ్ వంటి హెవీవెయిట్‌లు తమ తాజా ఆఫర్‌లను ప్రదర్శించేందుకు రెడీగా ఉన్నాయి. అలాగే, ద్విచక్ర వాహన తయారీదారులలో హీరో మోటోకార్ప్, హోండా, ఏథర్ ఎనర్జీ, బజాజ్ ఆటో, యమహా, రాయల్ ఎన్‌ఫీల్డ్, సుజుకి, టీవీఎస్ మోటార్ కంపెనీ, టోర్క్ మోటార్స్ తో పాటు వార్డ్ విజార్డ్ వంటి కంపెనీలు..

ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో కార్యక్రమంలో పాల్గొననున్నాయి. అలాగే, అశోక్ లేలాండ్, వోల్వో ఐచర్ వంటి వాణిజ్య వాహన తయారీదారులు తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను ప్రదర్శించడానికి ఈ ఎక్స్‌పోలో పాల్గొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories