West Bengal: కోల్‌కతాలోని సీబీఐ ఆఫీస్ ముందు ఉద్రిక్తత

Narada Scam Case West Bengal minister Sovan Chatterjee taken to CBI office
x

CBI office West Bengal

Highlights

West Bengal:మంత్రుల అరెస్ట్‌ను నిరసిస్తూ భారీగా చేరుకున్న టీఎంసీ కార్యకర్తలు

West Bengal: పశ్చిమబెంగా‌ల్‌లో నారదా స్కాం కేసును సీబీఐ అధికారులు ముమ్మరం చేశారు. అధికార పార్టికి చెందిన మంత్రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం మమతా బెనర్జీతో పాటు టీఎంసీ కార్యకర్తలు కూడా సీబీఐ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఓటమీని జీర్ణించుకోలేకపోతోందని, అందుకే తమ నేతలను అరెస్ట్ చేసి పగ తీర్చుకుంటోందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నారద కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఫిర్హాద్ హకీం.. మమతా బెనర్జీ కేబినెట్ లో రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు.

సీఎం మమతా బెనర్జీతో పాటు టీఎంసీ కార్యకర్తలు కూడా సీబీఐ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఓటమిని జీర్ణించుకోలేకపోతోందని, అందుకే తమ నేతలను అరెస్టు చేసి పగ తీర్చుకుంటోందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మంత్రి ఫిర్హాద్ హ‌కీంను, ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.2016 అసెంబ్లీ ఎన్నికల ముందు బెంగాల్‌ను కుదిపేసిన నారద టేపుల కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంత కాలం సద్దుమణిగిందనుకున్న ఈ కేసుపై సీబీఐ విచారణకు గవర్నర్ అనుమతించి వివాదానికి తెరతీశారు.

నారద స్టింగ్‌ ఆపరేషన్‌లో సీబీఐ అధికారులు ఇద్దరు మంత్రులను అరెస్ట్‌ చేయడం కలకలం రేపింది. మంత్రుల అరెస్ట్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కూడా అరెస్ట్‌ చేయాలని సవాల్‌ విసిరారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.



Show Full Article
Print Article
Next Story
More Stories