Nandini Gupta: ఆ ఒక్క సమాధానంతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన నందిని గుప్తా.. మిస్ వరల్డ్ పోటీలో గెలిస్తే సంచలనమే!

Nandini Gupta
x

Nandini Gupta: ఆ ఒక్క సమాధానంతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన నందిని గుప్తా.. మిస్ వరల్డ్ పోటీలో గెలిస్తే సంచలనమే!

Highlights

Nandini Gupta: మిస్ వరల్డ్ ఇండియా టైటిల్‌ను సొంతం చేసుకున్న నందిని ఇప్పుడు ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను మరింతగా ఎత్తుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది.

Nandini Gupta: నందిని గుప్తా... ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువవుతోంది. 2025 మేలో తెలంగాణ వేదికగా జరగబోయే 72వ మిస్ వరల్డ్ పోటీలో భారత్ తరఫున పాల్గొనబోయే అందగత్తె నందినినే. ఫెమినా మిస్ వరల్డ్ 2023లో నందిని రాజస్థాన్ రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహించి విజేతగా నిలిచింది. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి, ఢిల్లీతో కలిపి 30 మంది పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల తరఫున ఒకే ఒక ప్రాతినిధ్యం ఉండగా, నందిని అందరినీ మించిపోయింది.

2004లో రాజస్థాన్‌లోని కోటాలో జన్మించిన నందిని గుప్తా ప్రస్తుతం ముంబైలోని లాలా లజ్‌పత్‌రాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ చదువుతోంది.పదేళ్ల వయసులోనే తన కల మిస్ ఇండియా కావాలనేదే అని నందిని చెప్తుంది. ఆ కలను అక్షరాలా నిజం చేసుకుంది.

ఫెమినా మిస్ వరల్డ్ 2023 చివరి రౌండ్‌లో ఇచ్చిన సమాధానంతో నందిని తన వ్యక్తిత్వాన్ని, లోతైన ఆలోచనలను చాటిచెప్పింది. "ప్రపంచాన్ని మార్చాలా లేక నన్నే మార్చాలా" అనే ప్రశ్నకు నందినిచెప్పిన సమాధానం తన లోపలి మార్పే ప్రపంచ మార్పుకి బీజమవుతుందని స్పష్టంగా తెలిపింది. మార్పు లోపల నుంచే మొదలవుతుందన్న సందేశంతో, కొత్తగా ఆవిష్కరించుకున్న తనను స్వీకరించగల శక్తి ఉన్నవారే ప్రపంచంపై గాఢమైన ప్రభావాన్ని చూపగలరని వివరించింది.

ఈ సమాధానం తక్కువ సమయంలోనే జడ్జిలను ప్రభావితం చేయడమే కాదు, ప్రేక్షకుల మదిలో గాఢంగా నిలిచిపోయింది. మిస్ వరల్డ్ ఇండియా టైటిల్‌ను సొంతం చేసుకున్న నందిని ఇప్పుడు ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టను మరింతగా ఎత్తుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. మార్పును ఆహ్వానించాలనేవారికి దారి చూపాలన్నది ఆమె లక్ష్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories