మూడింటిపై దృష్టి సారించాలి: ముఖ్యమంత్రులతో మోదీ మాటమంతీ

మూడింటిపై దృష్టి సారించాలి: ముఖ్యమంత్రులతో మోదీ మాటమంతీ
x
Highlights

దేశ వ్యాప్తంగా కరోన్ వైరస్ ప్రభావం తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలు, తీసుసుకోబోయే వాటిపై చర్చించేందుకు రెండు రోజుల పాటు...

దేశ వ్యాప్తంగా కరోన్ వైరస్ ప్రభావం తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలు, తీసుసుకోబోయే వాటిపై చర్చించేందుకు రెండు రోజుల పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్ లతో రెండు రోజుల పాటు వీడియో కాన్ప్ రెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారి వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధి విధానాలను సావదానంగా విన్నారు. భవిషత్తులో తీసుకునే చర్యలపై చర్చించారు.

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు వైరస్ ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్ర, బెంగాల్, ఢిల్లీ, కర్నాటక, గుజరాత్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, అన్ లాక్ 2 విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఈ సమావేశం అనంతరం మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

'రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైనప్పుడు.. కరోనా వైరస్ మహమ్మారిపై విస్తృతంగా చర్చలు జరిపాం. కరోనా వ్యాప్తి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, కరోనా రోగులను నయం చేయడం, ఆర్ధిక కార్యకలాపాలను వృద్ధి చేయడంపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు


Show Full Article
Print Article
More On
Next Story
More Stories