2020 సంవత్సరంతో జాగ్రత్త.. తేదీ వేసేటప్పుడు మోసానికి చాన్స్ ఇవ్వకండి


అయితే నూతన సంవత్సరం రాకముందే బ్యాంకుల ఖాతాదారులకు, లీగల్ డాక్యుమెంట్ల తయారిదారులకు ఓ పెద్ద చిక్కు తీసుకొచ్చింది.
కొత్త సంవత్సరానికి ఆహ్వానం చెప్పేందుకు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు కుర్రకారు నూతన సంవత్సరం ఎలా సెలబ్రిట్ చేసుకోవాలో ముందే ప్లాన్ చేసుకున్నారు. ఇక వ్యాపారస్తులు, ఉద్యోగులు నూతన సంవత్సరం నుంచి జీవితం బాగుండాలని ప్లాన్లు వేసుకొని సిద్ధంగా ఉన్నారు. అయితే నూతన సంవత్సరం రాకముందే బ్యాంకుల ఖాతాదారులకు, లీగల్ డాక్యుమెంట్ల తయారిదారులకు ఓ పెద్ద చిక్కు తీసుకొచ్చింది.
అదేంటి అంటే 2020 అనే సంఖ్య పెద్ద చిక్కు తీసుకొచ్చింది. ఈ సంవత్సంరంలో చెక్కుల మీద, లీగల్ పత్రాలపై తేదీ వేసే ముందు ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే చెక్ మీద లీగల్ డ్యాక్యుమెంట్లపై తేదీ నెల సంవత్సరం ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. DD/MM/YY(డిడి/ఎంఎం/వైవై) పద్దతిలో రెండు అంకెలు ఉంటే మాత్రం పెద్ద చిక్కు అనే చేప్పాలి. లీగల్ డాక్యుమెంట్లు చెక్కులు, ఇస్తే వాటిని తీసుకున్న వారు దుర్భుద్ధితో డాక్యుమెంట్లను దుర్వినియోగం చేయడానకి అవకాశం ఉంది. ఉదాహరణకు 12వ తేదీ జనవరి 2020 అని రాయడానికి 12/01/20 అని రాస్తారు. అలా రాస్తే మాత్రం పెద్ద ప్రమాదం తెచ్చుకున్నట్లే.
అయితే మీరు రాసిన దానిని ఎవరైనా దుర్శినియోగం చేయాలని చూస్తే 2000 నుంచి 2099 వరకు ఏసంఖ్యనైనా చివర్లో వేసుకొనే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో మీరు ఇచ్చిన డాక్యుమెంట్లు, చెక్ లు మీకు వ్యతిరేకంగా వాడుకునే అవకాశం ఉంది. అయితే మీరు 2020 సంవత్సరంలో తేదీ వేసే ముందు ఆ ఏడాదంతా తేదీని DD/MM/YYYY(డీడీ/ఎంఎం/వైవైవైవై) అనే విధంగా వేయాలి. ఉదాహరణకు మీరు ఇచ్చే చెక్ లేదా డాక్యుమెంట్లలో 12/01/2020 అని పూర్తి సంవత్సరంతో రాయాలి. అజాగ్రత్తగా వ్యవహరించకుండా మొత్తం సంవత్సరాన్నయి రాయాలి. లేకుంటే చేజేతులా వేరేవారికి దుర్వినియోగం పరచడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఈ విషయాన్ని 2020 సంవత్సరం పాటిస్తే సరిపోతుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



