అయోధ్య ఆలయం కోసం భారీ గంట.. గంటకు మెరుగులు దిద్దేపనిలో ముస్లిం సోదరుడు!

అయోధ్య ఆలయం కోసం భారీ గంట.. గంటకు మెరుగులు దిద్దేపనిలో ముస్లిం సోదరుడు!
x
Highlights

అయోధ్య అంశాన్ని పలువురు హిందూ - ముస్లిం వివాదంగా భావించారు. అయోధ్యలో మాత్రం హిందూ, ముస్లింల మధ్య సయోధ్యనే ఉంది. ఉత్తరప్రదేశ్ లోని జలేసర్ లో అయోధ్య...

అయోధ్య అంశాన్ని పలువురు హిందూ - ముస్లిం వివాదంగా భావించారు. అయోధ్యలో మాత్రం హిందూ, ముస్లింల మధ్య సయోధ్యనే ఉంది. ఉత్తరప్రదేశ్ లోని జలేసర్ లో అయోధ్య రామాలయంలో ఉపయోగించేందుకు ఓ పెద్ద గంటను తయారు చేస్తున్నారు. ఈ గంటకు మెరుగులు దిద్దే పని ముస్లిమైన ఇక్బాల్ చేపట్టడం విశేషం.

రూ. 10 లక్షల వ్యయంతో ఈ గంటను రూపొందిస్తున్నారు. ఇటువంటివే మరో 10 గంటలను ఇక్కడ రూపొందించనున్నారు. ఈ పనులను పర్యవేక్షిస్తున్న వికాస్ మిత్తల్ మాట్లాడుతూ అయోధ్యలోని రామమందిరం కోసం రూపొందిస్తున్నఈ గంట సుమారుగా 2100 కిలోల బరువు ఉంటుందన్నారు. వివిధ లోహాల మిశ్రమంగా ఈ గంటను తీర్చిదిద్దుతున్నారు. ఈ గంట ఆరడుగుల ఎత్తు ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories