మంత్రి కాళ్ళకు నమస్కరించిన మహిళా అధికారి

Madhya Pradesh
x
Madhya Pradesh
Highlights

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దేవాస్ జిల్లాలో జరిగిన గురునానక్‌ 550వ జయంతి వేడుకల్లో ఆ రాష్ట్ర మంత్రి సజ్జన్ సింగ్ వర్మ...

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దేవాస్ జిల్లాలో జరిగిన గురునానక్‌ 550వ జయంతి వేడుకల్లో ఆ రాష్ట్ర మంత్రి సజ్జన్ సింగ్ వర్మ పాల్గొన్నారు. అయితే అక్కడ ఓ మహిళా అధికారి మంత్రి పాదాలకు నమస్కారం చేశారు. మంత్రి పాదాలు మహిళా అధికారి తాకిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజేష్‌ లునావత్‌ తన వ్యక్తిగత ట్వీటర్ లో పేర్ చేశారు. మధ్యప్రదేశ్ అధికార యంత్రాంగం మంత్రి పాదాల వద్ద ఉందని ఆయన ట్వీట్ చేశారు. గురునానక్‌ 550వ జయంతి వేడుకల్లో గురుద్వారలో ప్రార్థనలు నిర్వహించారు. అక్కడు మంత్రి చేరుకోగా అక్కడే ఉన్న మున్సిపల్‌ కమీషనర్‌ అధికారి మంత్రి పాదాలకు నమస్కరించారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో వివాదాస్పదమైంది. సీఎం కమల్‌నాథ్ సర్కార్‌పై ప్రతిపక్షాలు విమర్శులు గప్పిస్తున్నాయి.




Show Full Article
Print Article
Next Story
More Stories