Mumbai Court: ముంబై కోర్టు తీర్పు.. మైనర్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చినందుకు 3 ఏళ్ల జైలు

Mumbai Court: ముంబై కోర్టు తీర్పు.. మైనర్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చినందుకు 3 ఏళ్ల జైలు
x

Mumbai Court: ముంబై కోర్టు తీర్పు.. మైనర్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చినందుకు 3 ఏళ్ల జైలు

Highlights

2017లో మైనర్ బాలికను ఫ్లయింగ్ కిస్‌తో వేధించిన కేసులో ముంబై ప్రత్యేక కోర్టు నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.

ముంబైలోని ప్రత్యేక కోర్టు 9 ఏళ్ల క్రితం మైనర్ బాలికను వేధించిన కేసులో నిందితుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బాలికకు “ఫ్లయింగ్ కిస్” ఇస్తూ వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై ఈ తీర్పు వెలువడింది. ఘటన జరిగిన సమయంలో బాలిక వయసు 16 సంవత్సరాలు కాగా, నిందితుడి వయసు 19 సంవత్సరాలు అని కోర్టు నమోదు చేసింది. శిక్షతో పాటు రూ.3,000 జరిమానా కూడా విధించింది.

ఈ ఘటన 2017 జనవరి 31న హల్దీ కుంకుమ్ వేడుకల సందర్భంగా చోటుచేసుకుంది. ఆ సమయంలో నిందితుడు బాలిక వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం గమనించిన స్థానిక వ్యక్తి ఈ విషయాన్ని బాలిక తల్లికి తెలియజేశారు. అనంతరం తల్లి ప్రశ్నించగా, కొద్ది రోజులుగా నిందితుడు తనను వెంటాడుతున్నాడని, ట్యూషన్‌కు వెళ్లే సమయంలో ఒకసారి వెనుక నుంచి వచ్చి చేయి పట్టుకుని లాగాడని బాలిక తెలిపింది. భయంతో ఈ విషయాన్ని అప్పటివరకు కుటుంబానికి చెప్పలేదని వెల్లడించింది.

తర్వాత ఈ విషయంపై బాలిక కుటుంబ సభ్యులు నిందితుడిని హెచ్చరించగా, అతడు దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు.

విచారణ సమయంలో నిందితుడి తరఫు న్యాయవాది, నిందితుడు డ్యాన్స్ చేస్తూ ఫ్లయింగ్ కిస్ సైగ చేశాడని వాదించారు. అయితే కోర్టు, ఈ చర్య బాధితురాలి గౌరవాన్ని దెబ్బతీసే లైంగిక వేధింపుల కిందకే వస్తుందని స్పష్టం చేసింది. అందువల్ల నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories