త్వరలోనే దేశవ్యాప్తంగా 5జి సేవలు

త్వరలోనే దేశవ్యాప్తంగా 5జి సేవలు
x
Highlights

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, టిఎమ్ ఫోరం యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ 2020 వర్చువల్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు, ఈ సందర్బంగా..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, టిఎమ్ ఫోరం యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ 2020 వర్చువల్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు, ఈ సందర్బంగా భారతీయులకు అల్ట్రా-హై-స్పీడ్ కనెక్టివిటీ, సరసమైన స్మార్ట్ పరికరాలు మరియు ట్రాన్స్ఫర్మేషనల్ డిజిటల్ యాక్సెస్ కు జియో ఎలా సహాయపడుతుందో వివరించారు. త్వరలో తమ సంస్థ భారత్ అంతటా 5జి సేవలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలో 155 వ స్థానంలో ఉన్న భారత్ 2016లో టెలికం పరిశ్రమలోకి జియో అడుగు పెట్టిన తర్వాత అగ్రస్థానానికి వచ్చిందన్నారు.

2జీ నిర్మాణానికి టెలికం కంపెనీలకు 25 ఏళ్ళు పడితే, 4జీ నిర్మాణానికి జియోకు కేవలం మూడేళ్ళు మాత్రమే పట్టిందని తెలిపారు ముఖేష్. ప్రపంచంలోనే అతి తక్కువ డేటా టారిఫ్స్‌ను రిలయన్స్ ప్రారంభించిందన్న ముఖేష్.. జియో ప్రారంభించిన 170 రోజుల్లో 100 మిలియన్ కస్టమర్స్ ను ఆకర్షించిందని.. అంతేకాకుండా జియో రావడంతో భారతదేశం యొక్క నెలవారీ వినియోగం 0.2 బిలియన్ జిబి నుండి 1.2 బిలియన్ జిబికి పెరిగింది అన్నారు. ఇది 600 శాతం వృద్ధి అని ముకేశ్ చెప్పారు.

కనెక్టివిటీని మరింత విస్తరించడానికి, జియో సంస్థ త్వరలో 50 మిలియన్లకు పైగా గృహాలు మరియు ప్రాంగణాలకు హై-స్పీడ్, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోందని అన్నారు.. అదే సమయంలో, భారతదేశం అంతటా 5 జి సేవలను ప్రారంభించడానికి తమ సంస్థ వేగంగా సన్నాహాలు చేస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories