Goldbrick For Ayodhya Ram Temple: అయోధ్యలో రామమందిరం : మొఘల్‌ వారసుడి కానుక

Goldbrick For Ayodhya Ram Temple: అయోధ్యలో రామమందిరం : మొఘల్‌ వారసుడి కానుక
x
Highlights

Mughal Descendant Offers Gold Brick for Ayodhya Ram Temple: సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆలయం...

Mughal Descendant Offers Gold Brick for Ayodhya Ram Temple: సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆలయం నిర్మాణానికి ఆగస్టు ఐదున భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మొఘల్ వంశ వారసుడు ప్రిన్స్ యాకూబ్ హబీదుద్దీన్ టూసీ అయోధ్య రామాలయానికి బంగారపు ఇటుకను కానుకగా ఇస్తానని ప్రకటించారు. అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి ఈ ఇటుకను ఉపయోగించాలని చెప్పారు. ఆగస్టు ఐదున ప్రధాని నరేంద్ర మోడీకి ఒక కిలోల బరువున్న బంగారు ఇటుకను అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రధానిని కూడా కలవాలని అనుకుంటున్నారు.. ప్రధాని దగ్గర నుంచి పిలుపు రావాల్సి ఉందని చెప్పారు.

కాగా మొఘలుల వారసుడిగా చెప్పుకునే హబీదుద్దీన్ టూసీ గత సంవత్సరం తనను బాబ్రీ మసీదు కేర్ టేకర్ గా నియమించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ఆగస్టు 5న మధ్యాహ్నం 12.15 గంటలకు పునాది రాయి వేయాలని అయోధ్య ట్రస్ట్ నిర్ణయించింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి భూమిపూజకు రావాల్సిందిగా ట్రస్ట్ సభ్యులు కోరారు. అలాగే ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషిలతో సహా అయోధ్య ఉద్యమంలో భాగస్వాములను , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు అగ్ర నాయకులను భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వానించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే రెండుసార్లు అయోధ్యలో పర్యటించి.. ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories