ఆకలికి తట్టుకోలేక గోధుమలు కొనడానికి రూ.250 చోరీ.. బాలిక కుటుంబానికి సీఎం సాయం

ఆకలికి తట్టుకోలేక గోధుమలు కొనడానికి రూ.250 చోరీ.. బాలిక కుటుంబానికి సీఎం సాయం
x
Highlights

ఆకలికి తట్టుకోలేక గోధుమలు కొనడానికి రూ.250 చోరీ.. బాలిక కుటుంబానికి సీఎం సాయం

ఇన్నేళ్ల మన స్వంతత్ర భారతంలో ఆకలి కేకలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి. అత్యంత పేదరికంతో ఒక్కపూట కూడా తిండి లేక కడుపు కాలుతుంటే ఉండలేక ఓ బాలిక దొంగతనానికి పాల్పడింది. అయితే అది ఏ వేలో లక్షలో కాదు. కేవలం రూ. 250 మాత్రమే చోరీ చేసింది. ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. సాగర్ జిల్లా రహాలీ గ్రామానికి చెందిన ఓ కుటుంబం కూలి పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే కొంతకాలంగా ఆ కుటుంబాన్ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దాంతో ఇంట్లో వాళ్ళు పనులకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. తినడానికి తిండి కూడా దూరమైంది. ఈ క్రమంలో కుటుంబసభ్యుల ఆకలి తీర్చడం కోసం 12 ఏళ్ల బాలిక టికిటోరియా స్థానిక ఆలయంలో హుండీ నుంచి రూ.250 చోరీ చేసింది. ఆ డబ్బులతో పది కిలోల గోధుమలు కొనాలని షాపునకు వెళుతుండగా హుండీ చోరీ నేరం కింద బాలికను పోలీసులు అరెస్ట్ చేసి.. షాడోల్‌లోని కిశోర్ బాలికా సంరక్షణ గృహానికి తరలించారు.

విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ ప్రీతి మైథిల్ నాయక్ ఆ చిన్నారికి బెయిల్ ఇప్పించేందుకు ముందుకొచ్చారు. ఆమె పేదరికాన్ని గుర్తించిన సదరు కలెక్టర్ బాలిక తండ్రికి రెడ్‌క్రాస్ సొసైటీ నుంచి రూ. 10 వేల ఆర్థిక సాయం ఇప్పించారు. అంతటితో ఆగకుండా దాతలు ఎవరైనా ఈ కుటుంబానికి సహాయం చెయ్యాలంటూ కోరారు. దాంతో ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కు చేరింది. వారి దీనగాధ విని హతాశులైన ముఖ్యమంత్రి తక్షణం సహాయం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. కుటుంబం పడుతున్న బాధలు చూడలేక చిన్నారి తెలియక తప్పు చేసిందని.. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆమె చదువుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories