నటి సంగీతపై తల్లి ఫిర్యాదు

నటి సంగీతపై తల్లి ఫిర్యాదు
x
Highlights

సినీనటి సంగీతపై ఆమె తల్లి భానుమతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంటినుంచి వెళ్లిపోవాలని సంగీత ఒత్తిడి తెస్తున్నట్టు భానుమతి తన ఫిర్యాదులో...

సినీనటి సంగీతపై ఆమె తల్లి భానుమతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంటినుంచి వెళ్లిపోవాలని సంగీత ఒత్తిడి తెస్తున్నట్టు భానుమతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చెన్నై వలసరవాక్కంలోని సంగీత అత్తగారింట్లో ఆమె ఉంటున్నారు. పై పోర్షన్ లో సంగీత, క్రిష్ దంపతులు ఉంటుండగా.. కింది పోర్షన్ లో భానుమతి కొంతకాలంగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఈ ఇంటినుంచి తనను వెళ్లిపోవాల్సిందిగా సంగీత బెదిరిస్తోందని ఆమె ఆరోపిస్తున్నారు.

ఈ ఇంటిని వదిలి వేరే ఇంటిని చూసుకోవాలని.. లేదంటే సంగీత అన్న ఈ ఇంటిని స్వాధీనం చేసుకుంటాడని చెబుతూ అవసాన దశలో ఉన్న తనను వెళ్లిపోవాలని సంగీత అంటోందని భానుమతి ఆరోపిస్తోంది. దీనిపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తమిళనాడు మహిళా కమిషన్‌ ను సైతం ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంగీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సంగీత అత్తింటి వారు మాత్రం ఒప్పుకోకపోవడం లేదని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories