Covid 19: దేశంలో 4వేలకు పైగా కోవిడ్ కేసులు..తెలుగు రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసులు..!!

More than 4,000 Covid cases in the country..Active cases in Telugu states too telugu news
x

Covid 19: దేశంలో 4వేలకు పైగా కోవిడ్ కేసులు..తెలుగు రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసులు..!!

Highlights

Covid 19: దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం కేసుల సంఖ్య 4,023కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ...

Covid 19: దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం కేసుల సంఖ్య 4,023కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంఖ్య మే 31 నాటికి 3,395 ఉండగా జూన్ 1 నాటికి 3, 758కి జూన్ 2 నాటికి 3,961కి జూన్ 3 నాటికి 4,026 కి పెరిగాయి. జూన్ 4 నాటికి స్వల్పంగా తగ్గి 4,023 యాక్టివే కేసులు నమోదు అయ్యాయి.

దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి కొనసాగుతున్నట్లు ఈ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువగా కేసులు 1416 యాక్టివ్ కేసులతో కేరళ రాష్ట్రం ముందుండగా...ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కర్నాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతానికి ఏపీలో 28 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో గుంటూరు జిల్లాలో 3 కొత్త కేసులు వారం రోజుల్లో పాజిటివ్ గా తేలాయి. తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 4గా ఉంది. హైదరాబాద్ లో ఒక కేసు నమోదు అయ్యింది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 65 కొత్త కేసులు నమోదయ్యాయి. 5 మరణాలు సంభవించాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ లో ఒక్కొక్కటి మహారాష్ట్రలో 2 మరణాలు నమోదు అయ్యాయి. జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు దేశంలో మొత్తం 37 మరణాలు నమోదు అయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో 8 కేరళలో 8, ఢిల్లీలో 4, కర్నాటలో 4 మరణాలు నమోదుఅయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories