శుభవార్త : మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగింపు

శుభవార్త : మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగింపు
x
Highlights

నిన్నటితో లోన్ల మారటోరియం గడువు పూర్తయిన నేపథ్యంలో మరోసారి దీనిపై క్లారిటీ వచ్చేసింది..

నిన్నటితో లోన్ల మారటోరియం గడువు పూర్తయిన నేపథ్యంలో మరోసారి దీనిపై క్లారిటీ వచ్చేసింది. మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. మారటోరియం కొనసాగుతుందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. మారటోరియం గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఎదుట హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆయన.. ఇప్పటికే మారటోరియం కొనసాగింపుపై కసరత్తు ప్రారంభమైందని... మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే మారటోరియం నేపథ్యంలో ఇప్పటికే చెల్లించని ఈఎంఐలపై ఎలాంటి అదనపు రుసుము విధించకూడదని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ విషయాన్నీ అన్ని బ్యాంకులు పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అనంతరం దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.

కాగా ఆగస్ట్‌ 31తో ముగిసిన మారటోరియం గడువును డిసెంబర్‌ 31 వరకు పొడించాలని కోరుతూ న్యాయవాది విశాల్‌ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కరోనా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని మారిటోరియం గడువును ఈ ఏడాది చివరి వరకు పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను ఆదేశించాలని కోరారు. పిటిషన్‌ లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories