Corona Effect: మే15 వరకు చారిత్రక కట్టడాల మూసివేత

Monuments, Sites, Museums Closed Till May 15
x

తాజ్ మహాల్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Corona Effect: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Corona Effect: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే పరీక్షలు రద్దు చేసిన కేంద్రం తాజాగా మరో డెసిషన్ తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియంలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియంలను మే 15 వరకు మూసివేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తాజ్ మహల్, పతేహ్ పూర్ సిక్రి, తదితర కట్టడాల సందర్శనకు అనుమతి లేదన్నారు.

గత సంవత్సరం కూడా కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్న వేళ ఈ కట్టడాలన్నీ మూసివేశారు. ఆ తర్వాత వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలు ఎత్తివేశారు. అయితే, తాజాగా, గతంలో కంటే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతుండటంతో మరోసారి ఆంక్షలు అమలు చేస్తున్నారు. దేశంలో రోజువారీ కొవిడ్ కేసులు 2 లక్షలకుపైగా నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కట్టడి కోసం కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. కొత్త ఆంక్షలను కూడా అమల్లోకి తీసుకొస్తున్నాయి.

దేశంలో 3వేల 691 స్మారక కట్టడాలను ఏఎస్ఐ పర్యవేక్షిస్తుంది. వాటిలో 143 స్మారక కట్టడాలు సందర్శనకు అనుమతి ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 170 చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అందులో కేవలం 13 కట్టడాలకు మాత్రమే సందర్శనకు అనుమతి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories