నేటినుంచి పార్లమెంట్ సమావేశాలు.. తొలిసారి షిఫ్టుల వారీగా..

నేటినుంచి పార్లమెంట్ సమావేశాలు.. తొలిసారి షిఫ్టుల వారీగా..
x
Highlights

నేటినుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నడూ లేని విధంగా తొలిసారి షిఫ్టుల పద్ధతిలో ఉభయసభల సమావేశాలు జరగనున్నాయి. సోమవారం..

నేటినుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నడూ లేని విధంగా తొలిసారి షిఫ్టుల పద్ధతిలో ఉభయసభల సమావేశాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం లోక్‌సభ, మధ్యాహ్నం రాజ్యసభ, మంగళవారం నుంచి ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు రాజ్యసభ, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ప్రతి సభ్యుడు కచ్చితంగా కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. నెగిటివ్‌ వచ్చిన వారికే మాత్రమే పార్లమెంట్‌ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఇప్పటికే ఎంపీలు, సిబ్బంది సహా 4 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంతో కొందరు ఎంపీలకు కరోనా పాజిటివ్ అని తేలింది. వారు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. మరోవైపు పార్లమెంటులో చాలా కార్యకలాపాలను డిజిటలైజ్‌ చేశారు.

ప్రతి సభ్యుడు భౌతిక దూరం పాటించేలా ఎంపీల సీట్లలో మార్పులు చేశారు. అలాగే గ్యాలరీల్లోనూ సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం పార్లమెంటు ప్రాంగణాన్ని శానిటైజ్ చేశారు. ఇక రాజ్యసభ సభ్యుల్లో అధిక వయస్సువారే ఎక్కువగా ఉండటంతో వారికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆ సభ్యులతో పాటు వ్యక్తిగత సిబ్బంది, పనివారికి కూడా కరోనా టెస్టులు చేయాలనీ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశించారు. ఇదిలావుంటే సమావేశాల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలపై సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిరుద్యోగం వంటి అంశాలపైనా చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 11 ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులు సహా 23 బిల్లులను పార్లమెంటు ముందుకు తీసుకురానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories