Parliament Monsoon Session: ఈనెల 19 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

Monsoon Session of Parliament to Commence From July 19
x

Parliament 

Highlights

Parliament Monsoon Session: ఈనెల 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.

Parliament Monsoon Session: ఈనెల 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాల తేదీలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్‌ విడుదలైంది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సాధారణంగా జూలై మూడో వారంలో ప్రారంభమై ఆగస్టు 15వ తేదీ లోపు ముగుస్తుంటాయి. సమావేశాలకు సిద్ధం కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సహచర మంత్రివర్గ సభ్యులకు సూచించారు. అయితే కరోనా సంక్షోభంపై ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేవిధంగా సిద్ధమై రావాలని మోదీ సూచించారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. కరోనా థర్డ్‌ వేవ్‌ను అరికట్టేందుకు చేపట్టిన చర్యలు, సదుపాయాలు, వ్యాక్సిన్‌ డ్రైవ్‌లపై అవగాహన కలిగి ఉండాలని, ఆయా విభాగాల వారీగా అమలు అవుతున్న కేంద్ర సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహనతో సమావేశాలకు రావాలని మోదీ తన సహచరులకు సూచించారు. మరో వైపు దేశమంతా కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవడంతో సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో కేంద్రం, గ్యాస్, నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలు అమాంతం పెంచేసింది. దీని ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని నిలదీసేందుకు సిద్ధమౌతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories