Southwest Monsoon: వడివడిగా తరలివస్తున్న రుతుపవనాలు

Monsoon advances to Nicobar, South Andaman
x

Southwest Monsoon: వడివడిగా తరలివస్తున్న రుతుపవనాలు

Highlights

Southwest Monsoon: జూన్ 4న కేరళను తాకే అవకాశం

Southwest Monsoon: నైరుతీ రుతుపవనాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు పురోగ మించడానికి అనువైన వాతావరణం నెలకొన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి గాలులు నిలకడగా ఉండడం, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, అండమాన్‌ సముద్రంలో వర్షాలు పడడం వల్ల రుతుపవనాల పురోగమనానికి అవకాశం ఏర్పడినట్లు పేర్కొంది.ఈ నేపథ్యంలో రుతుపవనాలు వచ్చే 3, 4 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, అండమాన్‌ నికోబార్‌ దీవులు మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది.

వచ్చే 24 గంటల్లో రుతుపవ­నాలు ఈ ప్రాంతాల్లోనే కొంతవరకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలో కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. అప్పటివరకు ఎండల తీవ్రత కొనసాగనుంది. కాగా శుక్రవారం రాష్ట్రం భానుడి భగభగలతో అట్టుడికింది. నల్గొండ జిల్లా దామచర్లలో అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 45.4 , నిర్మల్ జిల్లా కడెం పెద్దూరులో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచీర్యాల, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో 44 నుంచి 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కనిపించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories