Monkey Pox: మంకీపాక్స్‌ను మహమ్మారిగా ప్రకటించిన WHO

Monkey Pox Spread In 58 Countries
x

Monkey Pox: మంకీపాక్స్‌ను మహమ్మారిగా ప్రకటించిన WHO

Highlights

Monkey Pox: ఇప్పటివరకు 58 దేశాలకు విస్తరించిన మంకీపాక్స్‌

Monkey Pox: ఓవైపు కరోనాతో ప్రపంచం పోరాడుతుంటే మరోవైపు మంకీపాక్స్‌ కలవరానికి గురిచేస్తోంది. ఇది 58 దేశాల్లోని 3వేల 417మందికి సోకినట్టు లెక్కలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను.. మహమ్మారిగా ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచ దేశాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్‌ మంకీపాక్స్‌ను పబ్లిక్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఆందోళన కల్గిస్తోంది. ఇది ఒక్క దేశం లేదా ప్రాంతానికి పరిమితం కాదని హెచ్చరిస్తోంది WHO. మంకీపాక్స్ వ్యాప్తిని నిరోధించడానికి తక్షణ చర్యలు అవసరమని స్పష్టం చేసింది.

కోవిడ్‌లాగా మంకీపాక్స్ అంత తేలికగా వ్యాపించదు కానీ.. జాగ్రత్తలు అవసరమని స్పష్టం చేసింది. దీనికి వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు చెప్పింది. కానీ పెరుగుతున్న కేసులు ఆందోళన కల్గిస్తున్నాయని, ఇక చిన్నారుల్లో మంకీపాక్స్ తీవ్రత ఎక్కువ ఉందని హెచ్చరించింది. ఎలుకలు, ఉడుతలు, పెంపుడు జంతువులతో సహా వన్యప్రాణులకు సంక్రమించే ప్రమాదం కూడా ఉందని వల్డ్ హెల్త్ నెట్‌వర్క్‌ వింగ్ వార్నింగ్ హెచ్చరించింది. ఈ మహమ్మారి కట్టడికి సైతం తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలియజేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories