ఒకవైపు కరోనా.. మరోవైపు హడలెత్తిస్తున్న మంకీ ఫీవర్..

ఒకవైపు కరోనా.. మరోవైపు హడలెత్తిస్తున్న మంకీ ఫీవర్..
x
Monkey Fever in Karnataka
Highlights

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతి పెరిగిపోతోంది. ఇప్పటికే జనం ఓ వైపు కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు కోతి జ్వరం చాప కింద నీరులాగా వ్యాపిస్తోంది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉదృతి పెరిగిపోతోంది. ఇప్పటికే జనం ఓ వైపు కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు కోతి జ్వరం చాప కింద నీరులాగా వ్యాపిస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో అక్కడి ప్రభుత్వం సతమతమవుతుంటే, మరోవైపు కొత్తగా వచ్చిన మంకీ ఫీవర్ ప్రభుత్వాన్ని, ప్రజలను మరింత వణికిస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి రాష్ట్రంలోని 12 జిల్లాలకు వ్యాపించింది. సుమారు రెండు వందలపైన కేసులు నమోదయ్యాయి.

గత ఆదివారం ఉత్తర కన్నడ జిల్లా లోని కూలర్క గ్రామంలో 41 కేసులు వెలుగు చూశాయి. చిక్క మంగళూరు 10, శివ మొత్త జిల్లాలో ఏకంగా 146 కేసులు నమోదవడంతో కలకలం సృష్టిస్తోంది. దీంతో ఈ వైరస్‌పై కూడా వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో అక్కడ ప్రభుత్వ యంత్రంగం అప్రమత్తం అయింది. దీంతో వారు నివారణ చర్యలు చేపట్టారు. నాలుగు రోజుల పాటు జ్వరం వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories