PM Modi: యాస్ తుపాను పై మోదీ సమీక్ష

PM Modi, Review, Cyclone, India,
x

ప్రధాని మోడీ (ఫైల్ ఇమేజ్)

Highlights

PM Modi: ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ మోదీ దిశానిర్ధేశం చేశారు.

PM Modi: తౌక్తే తుపాను తీవ్ర నష్టం కలిగించడంతో ఈసారి కేంద్రం అప్రమత్తమైంది. గుజరాత్, కేరళ, మహారాష్ట్ర మూడు రాష్ట్రాలు తేక్తే తీవ్రతకు దెబ్బ తిన్నాయి. ఆఖరికి అరేబియా తీరంలో నౌకలు కూడా దెబ్బ తిన్నాయి. అందుకే యాస్ తుపాను వస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోకస్ మొత్తం దాని మీదే పెట్టినట్లు కనపడుతోంది.

ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ నుండి సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు, టెలికాం కార్యదర్శులు, విద్యుత్, పౌర విమానయానం, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖలతో పిఎం నరేంద్ర మోడీ సైక్లోన్ యాస్ తీవ్రతను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న సన్నాహాలను సమీక్షించారు. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాస్ తుఫానును ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలంటూ మోదీ ఆయా మంత్రిత్వశాఖ అధికారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ మోదీ దిశానిర్ధేశం చేశారు.

కాగా, యాస్ తుఫానుపై క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ(ఎన్‌సీఎంసీ) స‌మావేశం నిన్న జ‌రిగిన సంగతి తెలిసిందే. తూర్పున బంగాళాఖాతంలో కేంద్రీకృత‌మై ఉన్న 'యాస్' తుపాను ఎదుర్కోవటానికి కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, ఏజెన్సీల సంసిద్ధతను ఎన్‌సీఎంసీ స‌మావేశంలో సమీక్షించింది. మే 26 సాయంత్రానికి యాస్ తుపాను పశ్చిమ బెంగాల్, ప్రక్కనే ఉన్న ఉత్తర ఒడిశా రాష్ట్ర తీరాలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు.

తుపాను యొక్క తాజా స్థితి గురించి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ (ఐఎండీ) ఈ కమిటీకి వివరించారు. యాస్ తుపాను గాలి వేగం 155 నుండి 165 కిలోమీటర్ల మేర ఉండ‌వ‌చ్చ‌ని.. దీంతో ఈ రాష్ట్రాల తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షపాతంతో కూడిన‌ తుఫాను వ‌ర్షాలు సంభవించే అవ‌కాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ వెల్లడించారు. తుఫాను ఎదుర్కోవటానికి సన్నాహక చర్యల గురించి సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కమిటీకి వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories