Top
logo

రైతులకు నెలనెలా 3 వేల రూపాయల పెన్షన్‌ ... స్కీమ్‌ను ప్రారంభించిన మోడీ

రైతులకు నెలనెలా 3 వేల రూపాయల పెన్షన్‌ ...  స్కీమ్‌ను ప్రారంభించిన మోడీ
X
Highlights

రైతులకు ఇక నుంచి నెలనెలా పెన్షన్ అందనుంది. రైతులకు నెలకు మూడువేల రూపాయలు పెన్షన్ అందించే పథకాన్ని ప్రధాని...

రైతులకు ఇక నుంచి నెలనెలా పెన్షన్ అందనుంది. రైతులకు నెలకు మూడువేల రూపాయలు పెన్షన్ అందించే పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచార శంఖారావంలో ప్రధాని మోడీ పాల్గొని ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. ఇదే కాక ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షాహెబ్ గంజ్‌లో మల్టీ మోడల్ టెర్మినల్‌ను ప్రారంభించారు. ఈ పథకం కింద 18 నుంచి 40 ఏళ్ళ లోపు వారు చేరితే, వారు 60 సంవత్సరాల వయస్సు రాగానే నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది. వచ్చే ఏడాది మొదట్లో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.


Next Story