Mallikarjun Kharge: మోడీ కాంగ్రెస్‌ను దూషించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ు

Modi Has Made It His Job To Vilify The Congress Says Mallikarjun Kharge
x

Mallikarjun Kharge: మోడీ కాంగ్రెస్‌ను దూషించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ు

Highlights

Mallikarjun Kharge: నిరుద్యోగం, ధ‌ర‌ల మంట‌తో ప్రజ‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ు

Mallikarjun Kharge: బీజేపీ ప‌దేండ్ల హ‌యాంలో చేప‌ట్టిన ప‌నుల గురించి ప్రధాని న‌రేంద్ర మోదీ మాట్లాడ‌టం లేద‌ని, ఆయ‌న కాంగ్రెస్‌ను దూషించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఆరోపించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ఖర్గే చండీఘ‌ఢ్‌లో పర్యటించారు. హ‌రియాణ సంపన్న రాష్ట్రమైనప్పటికీ ఇక్కడ నిరుద్యోగం, ధ‌ర‌ల మంట‌తో ప్రజ‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని అన్నారు. ఇక్కడి ప్రభుత్వం వ‌ద్ద వ‌న‌రులు అపారంగా ఉన్నా రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింద‌ని ప్రజ‌లు మాట్లాడుతున్న ప‌రిస్ధితి నెల‌కొంద‌ని చెప్పారు. అభివృద్ధి బాట‌లో న‌డ‌వ‌డాన్ని హ‌రియాణ ప్రభుత్వం విస్మరించింద‌ని విప‌క్షాలపై బుర‌ద‌చ‌ల్లటంతోనే కాషాయ పాల‌కులు స‌మ‌యం వృధా చేస్తున్నార‌ని ఖ‌ర్గే మండిప‌డ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories