Modi Bunkers: మోదీ బంకర్లు.. కశ్మీర్‌లో ప్రస్తుత పరిణామాలు ఇవే!

Modi Bunkers
x

Modi Bunkers: మోదీ బంకర్లు.. కశ్మీర్‌లో ప్రస్తుత పరిణామాలు ఇవే!

Highlights

Modi Bunkers: ఇలా పహల్గాం ఘటన తర్వాత సరిహద్దు జీవితంలో మళ్లీ అప్రమత్తత మోత మోగింది.



Modi bunkers: పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా వద్ద నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. దీంతో సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు తమ పాత బంకర్లను మళ్లీ తయారుచేస్తున్నారు. సలోత్రి, కర్మర్హా వంటి పాకిస్తాన్ ఆర్మీ పోస్టులకు సమీపంలోని గ్రామాల ప్రజలు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం తలెత్తినా జాగ్రత్తగా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కొంతకాలంగా గడిపిన ప్రశాంత జీవితాన్ని మరచిపోయి ఇప్పుడు మళ్లీ పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వీడియోల్లో వారు కంబళ్లు, మంచాలు, అవసరమైన వస్తువులు బంకర్లలో ఉంచుతూ కనిపిస్తున్నారు. పహల్గాం దాడి తర్వాత భయం నెలకొన్నప్పటికీ, లోయలో మళ్లీ శాంతి నెలకొనాలని ఆశిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఈ గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. దేశానికి తాము అండగా ఉంటామని, అవసరమైతే తమ ప్రాణాలను త్యాగం చేయడానికీ వెనుకాడబోమని ధైర్యంగా చెబుతున్నారు. సరిహద్దుకు అతి సమీపంలో ఉండే ఈ గ్రామాల్లో కాల్పుల ఘటనలు మళ్లీ జరుగే అవకాశం ఉన్నందున తమ కుటుంబాలను రక్షించుకునేందుకు బంకర్లను శుభ్రం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ బంకర్లకు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పుడు మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ 'మోదీ బంకర్లు' ఏమిటంటే, ప్రధానమంత్రి మోదీ పాలనలో నిర్మించిన భద్రతా బంకర్లు. భారత్-పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తరచూ కాల్పులు జరిపే సమయంలో వీటి ప్రాముఖ్యత మరింత పెరిగింది. పూంచ్, రాజౌరి, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో వ్యక్తిగత, కమ్యూనిటీ బంకర్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు, సాంకేతిక మద్దతు అందించింది.

ఇటీవల కాస్త ప్రశాంతత నెలకొన్న సమయంలో ఈ బంకర్లు ఉపేక్షించారు. కానీ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలు మళ్లీ వీటిని సరిచేసుకుంటున్నారు. భద్రతా దళాలు ఇప్పటికే హైఅలర్ట్‌పై ఉన్నాయ్. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories