మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య అధికార నివాసంలో ఉగాది వేడుకలు.. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ

Modi Attends Ugadi Milan Programme in Delhi hosted by Venkaiah Naidu
x

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య అధికార నివాసంలో ఉగాది వేడుకలు.. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ 

Highlights

Ugadi Milan: చక్కని కార్యక్రమం నిర్వహించారంటూ ప్రధాని ప్రశంస

Ugadi Milan: శ్రీ శోభకృత్‌ నామ ఉగాది సందర్భంగా ఢిల్లీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధికార నివాసంలో ఉగాది మిలన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను మోడీ తిలకరించారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసేలా వెంకయ్య, ఆయన కుటుంబ సభ్యులు చక్కని కార్యక్రమం నిర్వహించారని మోడీ ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, హరియాన గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా, రాజ్యసభ చైర్మన్‌ హరివంశ్‌, కేంద్ర మంత్రి గోయల్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories