Top
logo

కడుపులోంచి ఫోన్‌ రింగ్‌టోన్.. పోలీసులు పరేషాన్..

కడుపులోంచి ఫోన్‌ రింగ్‌టోన్.. పోలీసులు పరేషాన్..
Highlights

సెల్ ఫోన్ రింగ్ మోగుతోంది.. కానీ ఎక్కడి నుంచో అర్థం కావడం లేదు.. తీరా ఎక్కడి నుంచా అని సరిగ్గా పరిశీరిస్తే అది ఓ ఖైదీ దగ్గరి నుండి. అది కూడా ఖైదీ కడుపులోంచి వస్తున్నా విషయం తెలుసుకొని ఒక్కసారిగా కంగుతిన్నారు.

సెల్ ఫోన్ రింగ్ మోగుతోంది.. కానీ ఎక్కడి నుంచో అర్థం కావడం లేదు.. తీరా ఎక్కడి నుంచా అని సరిగ్గా పరిశీరిస్తే అది ఓ ఖైదీ దగ్గరి నుండి. అది కూడా ఖైదీ కడుపులోంచి వస్తున్నా విషయం తెలుసుకొని ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన న్యూఢిల్లీలోని తీహార్ జైలు జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే.. తీహార్ జైలులో విచారణలో ఉన్న ఒక ఖైదీని కోర్టులో హాజరపరిచి తిరిగి జైలుకు తీసువచ్చారు. అనంతరం ఆ ఖైదీని తనిఖీ చేస్తుండగా సెల్ ఫోన్ రింగ్ అవుతున్న శబ్ధం వినిపిస్తోంది. అయితే మొదట ఎక్కడి నుంచో లే అని లైట్ తీసుకున్నారు. తరువాత మళ్లీ అదే పనిగా పోన్ శబ్ధం మోగుతోంది.

ఈ విషయం సరిగ్గా గమనించగా చివరికి ఖైదీ దగ్గరి నుంచి వస్తోందని మాత్రం గ్రహించారు. ఖైదీని తనిఖీ చేయగా తన జేబులో అయితే లేదు.. మరి ఇంక ఎక్కడి నుండి అని గమనిస్తే అది అతడి కడుపులోంచి అని పసిగట్టారు. దీంతో ఆ ఖైదీని ప్రశ్నించగా తాను అతిచిన్న ఫోనును మింగేశానని తెలిపాడు. దీంతో ఒక్కసారిగా జైలు కంగుతిన్నారు. దీంతో హుటాహుటినా ఆసుపత్రికి తరలించి కడుపులో నుంచి ఫోన్ ను బయటకు తీయించారు. అయితే గతంలోనూ ఇదే ఖైదీ జైలు లోపలికి ఫోన్ ను తీసుకువస్తూ పట్టుపడ్డడని అధికారులు వెల్లడించారు.

Next Story


లైవ్ టీవి