MK Stalin: డీఎంకేకు రెండోసారి అధినేతగా ఎన్నికైన స్టాలిన్

MK Stalin Was Elected as the Leader of DMK for the Second Time
x

MK Stalin: డీఎంకేకు రెండోసారి అధినేతగా ఎన్నికైన స్టాలిన్

Highlights

MK Stalin: స్టాలిన్‎ నాయకత్వానికే మొగ్గు చూపిన డీఎంకే నేతలు

MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి పార్టీ అధినేతగా ఎన్నికయ్యారు. ఇటీవల ఏర్పాటైన డీఎంకే జనరల్ కౌన్సిల్ ఇవాళ చెన్నైలో సమావేశమై స్టాలిన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. డీఎంకే నేతలంతా స్టాలిన్ నాయకత్వానికే ఓటేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నేత దురైమురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. స్టాలిన్ తో పాటు దురైమురుగన్, టీఆర్ బాలు కూడా ఈ పదవులు చేపట్టడం రెండోసారి. కరుణానిధి మరణానంతరం స్టాలిన్ 2018లో తొలిసారి డీఎంకే చీఫ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 69 ఏళ్ల స్టాలిన్ గతంలో పార్టీ కోశాధికారిగా, యువజన విభాగం కార్యదర్శిగా వ్యవహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories