Top
logo

మోదీజీ మహిళలపై శ్రద్ధ పెట్టండి .. అందాల పోటీలో సలహా

మోదీజీ మహిళలపై శ్రద్ధ  పెట్టండి .. అందాల పోటీలో సలహా
Highlights

భారత ప్రధాని మోదీ నుంచి ఉద్ధేశించి కోహిమా 2019 అందాల పోటీ రన్నరప్ సువోహు "మోదీ ఆవులపై శ్రధ్ద పెట్టడం కంటే ఎక్కువ మహిళలపై శ్రద్ధ పెట్టాలని" అని సూచించారు.

ఈశాన్య భారతావనిలోని కోహిమా 2019 అందాల పోటీ నాగాలాండ్‌లోని జోట్సోమాలో నిర్వహించారు. ఈ పోటీని "ఎడ్యుకేట్‌ ఏ గర్ల్‌ ఎంపవర్‌ ఏ సొసైటీ" అగాథోస్‌ సొసైటీ నిర్వహించింది. అందులో విస్ సువోహు రన్నరప్ గా నిలిచారు. ఆ పోటీల్లో‎ ఆమె ఇచ్చిన ఓ సందేశం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తుంది.

ఈ ఏడాది ఈశాన్య భారతదేశంలో కోహిమా2019 అందాల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో ఫైనల్ రౌండ్ లో భాగంగా జ్యూరీ సువోహును ప్రశ్నించారు. అయితే అందులో భాగంగా వారు భారత ప్రధాని మోదీపై ప్రశ్న అడిగారు. మోదీ మిమ్మల్ని పిలిచి మాట్లాడితే ఆయనతో ఏం మాట్లాడతారు అని ప్రశ్నించారు. అయితే దానికి సువోహు బదులిస్తూ .. "ప్రధాని మోదీ పిలిచి మాట్లాడితే, ఆవుల మీద కన్నా మహిళలపై ఎక్కువ శ్రద్ధ చూపాలని మాట్లాడాతాను" అని సమాధానం ఇచ్చారు. అయితే ఆమె ఇచ్చిన ఈ జవాబుతో ప్రేక్షకుల్లో నవ్వులు విరిశాయి. సువోహు ఇచ్చిన జవాబుపై సోషల్‌ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్‌ వస్తోంది.

Next Story