కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి లోకేష్ భేటీ

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి లోకేష్ భేటీ
x
Highlights

కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్టవ్ తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ రోజు న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.

ఢిల్లీ: కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్టవ్ తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ రోజు న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రం లో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు వివరించారు. మంగళగిరి లో నిర్వహించిన పైలెట్ ప్రాజెక్ట్, అందులో ఎదుర్కున్న సమస్యలు అధిగమించడానికి ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానం తీసుకొచ్చాం అని వివరించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణన కు కేంద్ర సహాయం కావాలని లోకేష్ కోరారు. దీనికి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.

రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులకు అద్భుతమైన వేదికగా ఏర్పాటుచేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు MeitY స్టార్టప్ హబ్ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో AVGC-XR, WAVEX ఫ్రేమ్‌వర్క్ కింద InnoXR యానిమేషన్, AR/VR, Immersive Technologies కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు సహకారం అందించండి. ఇండియా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) మిషన్ కింద రాష్ట్రంలో ఏఐ విస్తృతి వేగవంతానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఎంపీలు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories