Lockdown in Delhi 2021: వలసకూలీలకు మళ్లీ మొదలైన కష్టాలు

Migrant Labour Problems 2020 Scene Repeated With Lockdown in Delhi 2021
x

వలస కూలీలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Lockdown in Delhi 2021: ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించడంతో సొంతూళ్లకు పయనం * వలసకూలీలతో రద్దీగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

Lockdown in Delhi 2021: వలస కూలీలకు మళ్లీ కష్టాలొచ్చాయి. అన్నీ సర్దుకున్నాయనుకునే లోపే వారి జీవితాలను కరోనా కాటేసింది. రోజూ కూలీ చేతిలో పడనిదే ముద్ద దిగని ఆ ప్రాణాలకు ఎక్కడ పస్తులుండాల్సి వస్తుందో అన్న భయం మొదలైంది. ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వెంటనే మూటాముళ్లె సర్దుకుని సొంతూళ్ల బాట పట్టారు. దీంతో రాజధాని నగరంలో బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి.

గతేడాది అనుభవాలతో ఉపాధి కోల్పోతామనే ఆందోళనతో వలస కూలీలు సొంతూళ్ల బాట పడుతున్నారు. వీకెండ్ కర్ఫ్యూతోనే వలస కూలీల తిరుగు ప్రయాణాలు ప్రారంభం అయినా.. ఆరు రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా బస్‌ టర్మినల్‌కు వచ్చేశారు. దీంతో ఆనంద్ విహార్ బస్టాండ్‌ వలస కార్మికులతో నిండిపోయింది. అయితే లాక్‌డౌన్‌ ప్రకటనకు ముందు తమకు సమయం ఇవ్వాల్సిందంటున్నారు వలస కూలీలు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో 2 వందల రూపాయలు అయ్యే ప్రయాణ ఖర్చు 3నుంచి 4 వేల రూపాయలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ కూలీ డబ్బులతో కడుపు నింపుకునే తాము అంత డబ్బు పెట్టి ఎలా వెళ్లాలంటున్నారు.

అయితే వలస కూలీలంతా ఒకేసారి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎవరూ కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో ఎక్కడ కోవిడ్ కేసులు మరింత పెరిగే ప్రమాదం నెలకొందనే భయం పట్టుకుంది. ఢిల్లీ నుంచి వెళ్లిన వారితో కోవిడ్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఇతర రాష్ట్రాల్లో గుబులు మొదలవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories