Dry Swab Tests: రూ.60కే కోవిడ్ డ్రై స్వాబ్ టెస్టు

Meril Diagnostics to Manufacture Kits for CCMB Dry Swab Tests
x

Dry Swab Tests:(The Hans India) 

Highlights

Dry Swab Tests: సీసీఎంబీ కొత్త ఆర్టీపీసీఆర్ కిట్ ను రిలీజ్ చేస్తోంది. దీని వల్ల కేవలం 60 రూపాయలకే టెస్టు చేయించుకునే అవకాశం.

Dry Swab Tests: కరోనా టెస్టులు మాస్ గా చేయడానికి వీలుగాక.. ప్రైవేటు సంస్థలకు వదిలేశాయి ప్రభుత్వాలు. ప్రైవేటు సంస్థలు భారీగా వసూలు చేస్తుండటంతో జనం తప్పనిసరి కావడంతో సమర్పించుకుంటున్నారు. కాని ఇప్పుడు సీసీఎంబీ కొత్త ఆర్టీపీసీఆర్ కిట్ ను రిలీజ్ చేస్తోంది. దీని వల్ల కేవలం 60 రూపాయలకే టెస్టు చేయించుకునే అవకాశం రాబోతుంది.

ఈ కిట్ల తయారీకి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. భారత్‌కు చెందిన గ్లోబల్ మెడికల్ డివైజెస్ కంపెనీ 'మెరిల్' సంస్థ తాజాగా సీసీఎంబీతో ఒప్పందం చేసుకుంది. తాము తయారుచేసే ఒక్కో కిట్‌తో 100 పరీక్షలు చేయొచ్చని, ఒక్కో పరీక్షకు వ్యయం రూ. 45 నుంచి రూ. 60 మధ్య ఉంటుందని పేర్కొంది. డ్రై స్వాబ్ టెస్టును చేసే తొలి సంస్థ తమదేనని తెలిపింది. ఈ కిట్‌ల ద్వారా ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాలు వేగంగా వెల్లడించేందుకు వీలవుతుందని పేర్కొంది. నెలకు 2 కోట్ల కిట్లను తయారుచేసేంత సామర్థ్యం తమకు ఉందని తెలిపింది. తాము ఇప్పటికే ర్యాపిడ్ యాంటీజెన్, యాంటీబాడీ ర్యాపిడ్ కిట్లను తయారు చేస్తున్నట్టు ఆ సంస్థ ఉపాధ్యక్షుడు సంజీవ్ భట్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories