Mera Ration App: మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ కు శ్రీకారం

Mera Ration app launches: Govt Launches Mera Ration mobile app
x

ఇమేజ్ సోర్స్:(ది హన్స్ ఇండియా)

Highlights

Mera Ration App: 'వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు' పథకాన్ని అమలు చేసేందుకు కొత్తయాప్‌ను కేంద్రం విడుదల చేసింది.

Mera Ration App: జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశవ్యాప్తంగా 'వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు' పథకాన్ని అమలు చేసేందుకు కొత్తయాప్‌ను కేంద్రం విడుదల చేసింది. శుక్రవారం కేంద్రప్రభుత్వం మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ యాప్‌ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. జీవనోపాధి కోసం కొత్త ప్రాంతాలకు వెళ్ళే రేషన్‌ కార్డ్‌ హోల్డర్లకు మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ ప్రయోజనం చేకూరుస్తుందని ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ప్రకటించారు.

32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు...

ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ పథకంలో భాగస్వామ్యం అయ్యాయని.. త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. వన్ రేషన్ కార్డులో భాగస్వామ్యం కాని మిగిలిన నాలుగు రాష్ట్రాలైన అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ అనుసంధానం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తవుతుందని సుధాన్షు పాండే తెలిపారు. దేశవ్యాప్తంగా గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య మొత్తం 15.4 కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు పూర్తయ్యాయని వివరించారు. 2019 ఆగస్టులో 4 రాష్ట్రాల్లో ప్రారంభమైన ఈ వ్యవస్థను 2020 డిసెంబర్‌ నాటికి వేగంగా విస్తరించినట్లు సుధాన్షు పాండే పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories