విద్యార్థుల డ్యాన్స్ కు మెలానియా ఫిదా.. ఈ టూర్ తన జీవితంలో..

విద్యార్థుల డ్యాన్స్ కు మెలానియా ఫిదా.. ఈ టూర్ తన జీవితంలో..
x
విద్యార్థుల డ్యాన్స్ కు మెలానియా ఫిదా.. ఈ టూర్ తన జీవితంలో..
Highlights

భారత పర్యటనలో భాగంగా మెలానియా ట్రంప్ ఢిల్లీలోని సర్వోదయ స్కూల్ ను సందర్శించింది. పాఠశాలలో నిర్వహించిన హ్యాపీనెస్ కార్యక్రమానికి హాజరయ్యారు మెలానియా...

భారత పర్యటనలో భాగంగా మెలానియా ట్రంప్ ఢిల్లీలోని సర్వోదయ స్కూల్ ను సందర్శించింది. పాఠశాలలో నిర్వహించిన హ్యాపీనెస్ కార్యక్రమానికి హాజరయ్యారు మెలానియా అమెరికా మొదటి మహిళకు భారతీయ సంప్రదాయంలో అపూర్వ స్వాగతం పలికారు చిన్నారులు విద్యార్థుల స్వాగతానికి మెలానియా ఫిదా అయింది.

రెండురోజుల భారత పర్యటనలో భాగంగా ట్రంప్ భార్య మెలానియా ఢిల్లీలోని దక్షిణ మోతీబాగ్ ప్రాంతంలోని సర్వోదయ కో ఎడ్యుకేషనల్ సీనియర్ సెకెండరీ స్కూల్ కి వెళ్లారు. అక్కడ ఆమెకు చిన్నారులు ఘన స్వాగతం పలికారు. తమ పాఠశాలకు అతిథిగా వచ్చిన మెలానియా నుదుట కుంకుమ పెట్టి, మంగళ హారతి పట్టి భారతీయ సంప్రదాయంలో ఆహ్వానించారు విద్యార్థులు. ప్రత్యేక వేషధారణలో ఉన్న స్టూడెంట్ ను చూసి మురిసిపోయారు మెలానియా ట్రంప్.

మెలానియా సర్వోదయ ప్రభుత్వ పాఠశాల అంతటా తిరిగారు. స్కూల్ ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరపడే పరికరాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఒక తరగతిలో కూర్చుని విద్యా విధానాన్ని పరిశీలించారు మెలానియా ట్రంప్ సర్వోదయ స్కూల్ లో విద్యవిధానం ఎలా ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు హ్యాపీనెస్ తరగతులకు హాజరయ్యారు. తరగతి గదిలో కూర్చుని పాఠాలను విన్నారు మెలానియా.

మెలానియా వెంట మెలానియాతో పాటు ముగ్గురు మహిళా టీచర్లు ఉన్నారు. టీచర్ల ప్రశ్నలకు చిన్నారులు చక్కగా సమాధానం చెప్పారు. పాటలు, సంగీతం, ఆటలపై తమకున్న ఆసక్తిని మెలానియా ముందు తమ టీచర్లకు వివరించారు విద్యార్థులు చిన్నారుల చెప్పిన సమాధానాలు శ్రద్ధగా విన్నారు మెలానియా. అనంతరం స్కూల్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆమెను ఆకర్షించాయి. పిల్లలు చేసిన డ్యాన్స్ లకు మెలానియా ఫిదా అయ్యారు. అనంతరం విద్యార్థులు గీసిన పెయింటింగ్ ను బహుమతిగా అందించారు.

సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన మెలానియా ట్రంప్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారత పర్యటన కోసం మొదటి సారి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందంటూ ఆమె ప్రసంగించారు. ఈ టూర్ తన జీవితంలో మరిచిపోని అనుభూతిని కలిగించిందని ఆమె అన్నారు.

అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ఢిల్లీలోని సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులతో ఆనందంగా ముచ్చటించారు. పాఠశాల అంత విద్యార్థులతో కలిసి తిరిగారు. అనంతరం ఆమె విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. నమస్తే అంటూ తన స్పీచ్ ను ప్రారంభించారు. ఇది సుందరమైన పాఠశాల, సంప్రదాయ నృత్యప్రదర్శనలతో నాకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు ఇది నా తొలి భారత పర్యటన. ఇక్కడి ప్రజలు మరిచిపోలేని విధంగా ఆధరించారని ఆమె అన్నారు.

భారత్ పర్యటన ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేనని ఈ టూర్ పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నేను ఎంతో ఆనందంగా ఉన్నామని మెలానియా అన్నారు. ఢిల్లీ పాఠశాలల్లో హ్యాపీనెస్ తరగతులు నిర్వహించడం ఎంతో స్పూర్తిదాయకం. ప్రకృతితో మమేకమై విద్యార్థులు తమ రోజును ప్రారంభించడం చాలా బాగుంది విద్యార్థులకు నైపుణ్యాలను తెలియజేస్తూ నేటి సమాజానికి ఉదాహరణగా నిలుస్తున్న ఉపాధ్యాయులందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని ఆమె చెప్పారు.

సర్వోదయ స్కూల్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. అమెరికాలో తాను ఈ పద్దతిలోనే తన బీ బెస్ట్ ఇన్సియేటివ్ ద్వారా పనిచేస్తానని ఆమె చెప్పారు. బీ బెస్ట్ లో మూడు ప్రధాన లక్ష్యాలున్నాయని, మత్తు పదార్థాల కారణంగా ఎదురయ్యే ప్రమాదాలు, ఆన్ లైన్ భద్రత, చిన్నారుల సంరక్షణ పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. సుమారు గంట సేపు సర్వోదయ స్కూల్ లో గడిపారు మెలానియా ట్రంప్.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories