Lockdown: లాక్‌డౌన్ ఎత్తేస్తాం.. కరోనా వైరస్ లేదు అందుకే ఈ నిర్ణయం


కరోనా వైరస్‌ను వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్‌ను వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా రోజు రోజుకు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ఎత్తివేతపై చాలా రాష్ట్రాలు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చాయి. లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ జూన్ 2వరకు పొడిగించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలానే యూపీ, తమిళనాడు, మహరాష్ట్రల ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్ పొడిగించాలని అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే కూడా లాక్‌డౌన్ పొడిగించాల్సిందే అని ప్రకటన చేశారు.
ఈ నెల 14వ తేదీ దేశమంతటా లాక్ డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ లాక్ డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి లాక్ డౌన్ నిబంధనలను సడలించబోతున్నామని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ప్రకటించింది. అయితే ప్రైవేట్ వ్యాపారాలపై నిషేధం ఉంటుందని ప్రకటించింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఈ నెల 15 నుంచి విద్యాసంస్థలు మినహా అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తామని ఆ రాష్ట్రం స్పష్టం చేసింది.
ఇక వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగుతాయని, అన్ని వాహనాలను రోడ్లపై అనుమతిస్తామని, మేఘాలయ ప్రభుత్వం చెప్పింది. కాగా.. మేఘాలయలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయితే వైద్యుల సూచనలను గ్రామీణ ప్రజలు పాటించాలని హెచ్చరించింది. కరోనా వ్యాప్తి రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. లాక్ డౌన్ మరితం కాలం సాగింతే ఇబ్బందులు ఎదుర్కొంటామని తాము కొనసాగించాలని కోరుకోవడంలేదని తెలిపింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



