చిరంజీవి వారిని కూడా కలుస్తారా?

చిరంజీవి వారిని కూడా కలుస్తారా?
x
Highlights

చిరంజీవి వారిని కూడా కలుస్తారా? చిరంజీవి వారిని కూడా కలుస్తారా?

బీజేపీ నేతలు.. రామ్ మాధవ్, సీఎం రమేష్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో సైరా సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనకు కొందరు ఢిల్లీ పెద్దలు హాజరు కానున్నారు. అంతకుముందే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసి.. 'సైరా' సినిమా చూడాల్సిందిగా కోరనున్నట్టు సమాచారం. ఇటీవల ఏపీ సీఎం జగన్ తో సమావేశం అయిన చిరంజీవి తాజాగా బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లడంతో.. రాజకీయ చర్చ మొదలైంది.

ఏపీలో బలమైన నేతకోసం బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని చేర్చుకోవాలని అనుకుంది.. ఆయనకు ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించడం తోపాటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని చిరుకు రాయబారం పంపినట్టు అప్పట్లో చర్చ జరిగింది. కానీ చిరు ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. చిరు సైతం తాను రాజకీయాలనుంచి ఇక తప్పుకున్నట్టే అని ప్రకటించారు. ఇటీవల తమిళనాడు వెళ్లిన ఆయన రజినీకాంత్, కమల్ హాసన్ లను రాజాకీయాల్లోకి రావొద్దని కోరారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు కూడా ఇదే విషయాన్ని చెప్పానన్న చిరు.. అతను ఆల్రెడీ పార్టీ పెట్టుకోవడంతో తిరష్కరించాల్సి వచ్చిందని చెప్పారు. మరోవైపు బీజేపీ అగ్రనేతలను కలుస్తున్న చిరు.. కాంగ్రెస్ పెద్దలను కూడా కలుస్తారా అన్న చర్చ రాజకీయవర్గాల్లో మొదలయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories