Dushyant Gautam: వచ్చే ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సీట్లను సాధించడమే లక్ష్యంగా పనిచేయాలి

Dushyant Gautam: వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే ఆత్మవిశ్వాసం మంచిదే కానీ మితిమీరిన ఆత్మవిశ్వాసం దెబ్బకొడుతుందని గుర్తించాలన్నారు.

R Tripura Malini
Updated on: 13 Dec 2022 8:02 AM IST
Meeting Of Uttarakhand MPs In The P resence Of Uttarakhand Chief Minister Pushkar Singh
X

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ సమక్షంలో ఉత్తరాఖండ్ ఎంపీల సమావేశం

Dushyant Gautam: వచ్చే ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సీట్లను సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఉత్తరాఖండ్ బీజేపీ ఇన్‌ఛార్జి దుష్యంత్ గౌతమ్‌ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ సమక్షంలో ఉత్తరాఖండ్ ఎంపీల సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే ఆత్మవిశ్వాసం మంచిదే కానీ మితిమీరిన ఆత్మవిశ్వాసం దెబ్బకొడుతుందని గుర్తించాలన్నారు. లోక్ సభ సభ్యులు రాష్ట్రప్రభుత్వ కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ ప్రజాభిమానం చూరగొనాలని సూచించారు. 2024 ఎన్నికలకు సన్నద్ధంకావాలని సూచించారు. జాతీయస్థాయి పదాధికారుల సమావేశంలో జరిగిన మేథోమధనంపై సమావేశంలో ప్రస్తావించారు. గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజాప్రతినిధుల్లో బాధ్యత మరింత పెరిగిందన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story