షాహి ఈద్గాలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామన్న హిందూ మహాసభ... పోలీసుల పహారాలో మధుర నగరం

Mathura City Under Police Watch
x

షాహి ఈద్గాలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామన్న హిందూ మహాసభ... పోలీసుల పహారాలో మధుర నగరం

Highlights

* శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసుల శాంతి ప్రదర్శన

Mathura: శ్రీకృష్ణ జన్మస్థావరం మధురలోని షాహి ఈద్గాలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని హిందూ మహాసభ ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మధుర నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తనీకుండా.. శాంతి భద్రతలను కాపాడేందుకు శాంతి ప్రదర్శన నిర్వహించారు. ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సివిల్ పోలీసులతోపాటు ప్రత్యేక పోలీసు బలగాలతో మధుర వీధుల్లో శాంతి ప్రదర్శన నిర్వహించారు. నగరమంతా 144 సెక్షన్ విధించారు. విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలను అడ్డుకుంటామని పోలీసులు హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణే తమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మధుర పోలీసుల పహారాలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories