దేశ వ్యాప్తంగా తాగు నీటికి కటకట..తాగు నీటి కోసం లాటరీ

తాగు నీటి కోసం జనం అల్లాడుతున్నారు. పొద్దున లేచింది మొదలు నీటి గురించే ఆలోచిస్తున్నారు, ఏ వైపు వెళ్తే నీరు...
తాగు నీటి కోసం జనం అల్లాడుతున్నారు. పొద్దున లేచింది మొదలు నీటి గురించే ఆలోచిస్తున్నారు, ఏ వైపు వెళ్తే నీరు దొరుకుతుంది, ఎప్పుడు వాటర్ ట్యాంకర్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. పలు చోట్ల నీటి కోసం జనం రోడ్డెక్కుతున్నారు, చెన్నై లాంటి ప్రాంతాల్లో నీరు తీసుకెళ్లేందుకు డ్రా వేస్తున్నారు. డ్రాలో నెంబర్ వచ్చిన వారికి మాత్రమే ఆ రోజు నీరు దొరుకుతుంది.
దేశ వ్యాప్తంగా తాగు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ర్టాలు ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, మహారాష్ర్టల్లోనూ ప్రజలు నీటికొరతతో అల్లాడుతున్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భ జలాలు అడుగంటి తాగు నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. తమ సమస్యను పట్టించుకోవాలంటూ పలు చోట్ల రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
చెన్నైలో తాగు నీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. పల్లవరం మున్సిపాల్టీ పరిధిలో 110 కుటుంబాలు ఒకే బావి నీటిపై ఆదారపడి ఉన్నారు. ఈ బావి నుంచి నీటిని తీసకునేందుకు డ్రా తీసుకుని వంతుల వారీగా నీరు తోడుకుంటారు. డ్రాలో వచ్చిన వరుస సంఖ్య ఆధారంగా నీరు తీసుకునేందుకు బావి దగ్గరకు అనుమతి ఇస్తారు ఒక్కొక్కరు నాలుగు బిందెల నీళ్లు మాత్రమే తోడుకోవాలనే నిబంధనలు పాటిస్తున్నారు.
మహారాష్ట్ర లోని మెల్ఘాట్ ప్రాంతంలో తాగు నీటికోసం 40 అడుగుల లోతులో ఉన్న బావుల్లోకి దిగుతున్నారు. నీటి కోసం బావులు, బోర్ల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. బావుల సమీపంలోనే నిద్రిస్తున్నారు. మరో రెండు నెలల వరకు తాగు నీటి తిప్పలు తప్పే అవకాశాలు కనిపించడం లేదు. డిమాండ్‌కు సరిపడా నీటిసరఫరా లేకపోవడంతో 60 శాతం ప్రాంతాల ప్రజలు నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైనా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ తగ్గటం లేదు.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
బీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMTకామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 61 పతకాలు..
9 Aug 2022 2:30 AM GMT