మహారాష్ట్రలోని గోండియా దగ్గర ప్రమాదం

Massive Train Mishap in Maharashtra
x

మహారాష్ట్రలోని గోండియా దగ్గర ప్రమాదం

Highlights

Maharashtra: ఒకే ట్రాక్‌పై వెళ్తున్న రెండు ట్రైన్లు ఢీ

Maharashtra: మహారాష్ట్రలో రైలు ప్రమాదం జరిగింది. ఒకే ట్రాక్‌పై ఒకదాని వెనుక వెళ్తున్న రెండు ట్రైన్లు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బిలాస్‌పూర్ నుంచి రాజస్థాన్‌లోని కోట ప్రాంతానికి వెళ్తుండగా గోండియా దగ్గర ముందు వెళ్తున్న ట్రైన్‌ను వెనుక నుంచి వస్తున్న మరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 50 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఒకే ట్రాక్‌పై రెండు ట్రైన్లు ఢీకొట్టడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మరమ్మతులు పూర్తి చేయడంతో రైళ్లు యథాతధంగా వెళ్తున్నాయి. అయితే సిగ్నల్ సమస్య వల్లే రెండు రైళ్లు ఢీకొన్నట్లు అధికారులు చెప్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories