Encounter: భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

Encounterr
x

Encounter

Highlights

Encounter: కాల్పుల విరమణకు తాము సిద్ధమంటూ శాంతి చర్చలకు మావోయిస్టులు లేక విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని...

Encounter: కాల్పుల విరమణకు తాము సిద్ధమంటూ శాంతి చర్చలకు మావోయిస్టులు లేక విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని మాండ్లా జిల్లా బిచ్చియా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఉదయం పోలీసులు స్పాట్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే వారిపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఇరుపక్షాల మధ్య సుమారు 4 గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి.

ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కైలాశ్ మక్వానా వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్, ఒక సాధారణ రైఫిల్, భారీ వైర్ లెస్ సెట్, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నామని..మిగతా మావోయిస్టు దళ సభ్యులు కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశామని డీజీపీ కైలాశ్ మక్వానా తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories