ఆకాశంలో పెను మార్పులు.. మొన్న సూపర్ మూన్.. ఈ సారి మార్నింగ్‌ ప్లానెట్స్‌ .. దేనికి సంకేతం

ఆకాశంలో పెను మార్పులు.. మొన్న సూపర్ మూన్.. ఈ సారి మార్నింగ్‌ ప్లానెట్స్‌ .. దేనికి సంకేతం
x
Representational Image
Highlights

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇప్పటికే ఈమ‌హ‌మ్మ‌రి ఎన్నో వేల మందిని బలితీసుకుంది.

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇప్పటికే ఈమ‌హ‌మ్మ‌రి ఎన్నో వేల మందిని బలితీసుకుంది. దీని దెబ్బ‌కు ప్ర‌పంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ పాటించాయి. మ‌న దేశంలో కూడా లాక్‌డౌన్ క‌న‌సాగుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో వాయు కాలుష్య తీవ్రత తగ్గుతోంది. కాలుష్య కోరల నుంచి భూమి తనని రక్షించుకుంటుందని ప్రకృతి ప్రేమికులు భావిస్తున్నారు. అయితే ప్రకృతి విపత్తులతో విల‌విలాడిపోతున్న ప్రజలకు ఆకాశంలో మార్పులు ఊరట కలిగిస్తున్నాయి. ఈనెల‌ 7వ తేదీన పింక్‌ సూపర్‌ మూన్‌ని జ‌నం అంతా ఆస్వాదించారు. తాజాగా ప్ర‌కృతిలో మ‌రో ఖగోళ సంఘటన జ‌ర‌గ‌బోతుంది.

ఏప్రిల్‌ 14, 15, 16వ తేదీల్లో ఈ ఖగోళ సంఘటన జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతోన్నారు. చంద్రుడితో గురుడు, శని, అంగారక గ్రహాలు ఒకే క్ర‌మంలోకి వ‌స్తాయ‌ని తెలిపారు. ఏప్రిల్‌ మధ్యలో ఈ మూడు గ్రహాలు ఒకే వరుసలో కన్పిస్తుంటాయి. కాలుష్య తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో... బైనాక్యులర్స్‌, టెలిస్కోప్ వంటివి లేకుండానే ఆ దృశ్యాన్ని నేరుగా ఆస్వాదించవచ్చని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. గురుడు, శని, అంగారక గ్రహాలని ఒకే వ‌ర‌స‌లోకే వ‌స్తే దానిని మార్నింగ్‌ ప్లానెట్స్‌ అని అంటారు. అంటే అవి ఉదయాన స్పష్టంగా కన్పిస్తుంటాయి.

అయితే ఈ సారి గురుడు,శ‌ని, అంగార‌క గ్రహాల‌తోపాటు చంద్రుడు కూడా అదే వరుసలో కనిపించనున్నాడు. ఏప్రిల్‌ 14, 15, 16న అంగారక గ్రహం వీటి నుంచి దూరంగా కదులుతుంది. అయితే ఈ చంద్రుడిని మూడు రోజులు గ‌మ‌నిస్తే.. సమీపంలోనే 3 గ్రహాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మూడు గ్ర‌హాలు వ‌రుస‌లోకి రావ‌డానికి మూడేళ్ల స‌మ‌యం ప‌డుతోంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories