తబ్లిగీ జమాత్ చీఫ్ కు కరోనా పరీక్షలు.. రిపోర్ట్ ఏంవచ్చిందంటే

తబ్లిగీ జమాత్ చీఫ్ కు కరోనా పరీక్షలు.. రిపోర్ట్ ఏంవచ్చిందంటే
x
Maulana Saad Kandhavli (File Photo)
Highlights

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 1,975 కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 26,917కి పెరిగింది. ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి 826కి మంది మృతి చెందారు. 5,913 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 20,177 మంది చికిత్స పొందుతున్నారు. అయితే భారత్ లో కరోనా వ్యాప్తి విదేశాల్లో ఉన్నవారితో వచ్చిందిట. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ తబ్లిగీ జమాత్ సమావేశం అనంతరం మరింత వేగంగా వ్యాపించిందని వార్తలు వచ్చాయి.

సమావేశాలు నిర్వహించవద్దని చెప్పినా వినకుండా తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కంధాల్వీ నిర్వహించారు. వైరస్ వ్యాప్తికి కారణం అయినా మౌలానా సాద్ కేసులు నమోదయ్యాయి. తాజాగా సాద్ కంధాల్వీకి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. ఈ మేరకు ఆయన న్యాయవాది తెలిపారు. జమాత్ చీఫ్ కరోనా పరీక్షల నివేదిక ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఇంకా అందలేదు. సోమవారం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సాద్ కంధాల్వీని విచారించే అవకాశాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories