logo
జాతీయం

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం

Maoists Encounter in Srinagar Jammu Kashmir Today 31 12 2021 | National News
X

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం

Highlights

Jammu Kashmir - Srinagar: రెండు రోజుల వ్యవధిలో తొమ్మది మంది ఉగ్రవాదులు హతం...

Jammu Kashmir - Srinagar: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో గురువారం రాత్రి స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా పొద్దుపోయిన తర్వాత గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు ప్రారంభించారు.

అప్రమత్తమైన భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారని కశ్మీర్ IGP విజయ్ కుమార్ తెలిపారు. వారిలో ఒకరిని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన సుహైల్ అహ్మద్ రాథర్‌గా గుర్తించామన్నారు. ఇక రెండు రోజుల వ్యవధిలో జమ్ముకశ్మీర్‌లో తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ చేశాయి.

Web TitleMaoists Encounter in Srinagar Jammu Kashmir Today 31 12 2021 | National News
Next Story