జార్ఖండ్‌: బ్రిడ్జిని పేల్చేసిన మావోయిస్టులు

జార్ఖండ్‌:  బ్రిడ్జిని పేల్చేసిన మావోయిస్టులు
x
ఓటు వేయటానికి లైన్లో వేచిఉన్న ఓటర్లు
Highlights

జార్ఖండ్‌ రాష్ట్రంలో తొలివిడత శాసనసభ ఎన్నికలకు పోలింగ్ శనివారం ప్రారంభమైంది. జార్ఖండ్ లోని 6 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో మొదటి విడత పోలింగ్‌ అధికారులు నిర్వహిస్తున్నారు.

జార్ఖండ్‌ రాష్ట్రంలో తొలివిడత శాసనసభ ఎన్నికలకు పోలింగ్ శనివారం ప్రారంభమైంది. జార్ఖండ్ లోని 6 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో మొదటి విడత పోలింగ్‌ అధికారులు నిర్వహిస్తున్నారు. తొలి విడత పోలింగ్ లో 37లక్షల 83,055మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రితోపాటు ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి నియోజకవర్గాలు శనివారం జరిగే తొలి విడిత ఎన్నికల్లో ఉన్నాయి.

అదేవిధంగా అన్ని పోటీలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన 15 మంది మహిళా అభ్యర్థులు, 189 పురుష అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇటీవల మవోయిస్టుల దాడులు జరిగిన నేపథ్యంలో లతేహర్, మణిక నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు పునరావృతం కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

అయితే ఒకవైపు ఎన్నికలు జరుగుతుండాగానే మరోవైపు మావోయిస్టులు రెచ్చిపోయారు. గుమ్లా జిల్లాలోని బిష్ణుపూర్‌లో ఓ బ్రిడ్జిని నేల మట్టం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని డిప్యూటి కమిషనర్‌ శశి రంజన్‌ తెలిపారు. ఇలాంటి చర్యలు మంచివి కావని వ్యాఖ్యానిచారు. మావోలు వంతెనె కూల్చినా పోలింగ్ కు అంతరాయం కలుగదని చేప్పారు. ప్రజలు భయాందోళనకు గరికావద్దని, ఓటు హక్కు వినియోగించుకోవాలని శశి రంజన్‌ కోరారు. ఈ సందర్భంగా మోదీ ట్విట్ చేశారు. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.

జార్ఖండ్‌లో 81అసెంబ్లీ నియోజకవర్గల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. తొలి దశలో 13 చోట్ట పోలింగ్ జరుగుతుండగా 12 చోట్ల బీజేపీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. మరో చోట స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలిపింది. వచ్చేనెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories